Unstoppable Prabhas Episode Promo: పెళ్లి రాసిపెట్టలేదు - అన్‌స్టాపబుల్ ప్రోమోలో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
28 December 2022, 21:39 IST
Unstoppable Prabhas Episode: అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమోలో పెళ్లిపై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలకృష్ణ, ప్రభాస్
Unstoppable Prabhas Episode: ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించి అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో పెళ్లిపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోకు ప్రభాస్ గెస్ట్‌గా హాజరుకానున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 30. జనవరి 6న రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌కు ప్రభాస్‌తో పాటు మరో టాలీవుడ్ హీరో గోపీచంద్ గెస్ట్‌గా రాబోతున్నాడు. తాజాగా ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన కొత్త ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో నిన్ను డార్లింగ్ అంటే దయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి...నేను నీ మాయలో పడిపోయాను అంటూ ప్రభాస్‌ను ఉద్దేశించి బాలకృష్ణ సరదాగా కామెంట్స్ చేశారు.
ఆ తర్వాత ఏంటి పెళ్లి ఉందా అంటూ బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ఇంకా రాసిపెట్టలేదేమో అంటూ ప్రభాస్ సమాధానం చెప్పడం నవ్వులను పంచుతోంది. నువ్వు మీ అమ్మకు చెప్పిన సమాధానాలు నాకు చెప్పకు అని బాలకృష్ణ సరదాగా అనడం ప్రోమోలో కనిపిస్తోంది.
నిన్ను ఎక్కువగా ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు డార్లింగ్ అని సమాధానం చెప్పాడు ప్రభాస్. . వెంటనే గర్ల్‌ఫ్రెండ్స్ అని బాలకృష్ణ ఇచ్చిన పంచ్‌కు ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నా ఈ మధ్య మర్చిపోతున్నా అంటూ ప్రభాస్ ఫన్నీగా ఆన్సర్ చెప్పడం ఆకట్టుకుంటోంది.
ఆ తర్వాత ప్రోమోలో గోపీచంద్ కనిపించాడు. 2008లో ఏదో హీరోయిన్ విషయంలో మీరు గొడవపడ్డారు అని బాలకృష్ణ ప్రశ్న అడుగుతుండగా... అది 2008 కాదు అని గోపీచంద్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం రేయ్ అంటూ ప్రభాస్ గోపీచంద్‌ను అడ్డుకోవడం ప్రోమోకు హైలైట్‌గా నిలుస్తోంది.
సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు ఆ తర్వాత మీ నాన్నగారి సినిమా చూడు అంటూ ప్రోమో చివరలో ప్రభాస్‌తో బాలకృష్ణ చెప్పడం ఆసక్తిని పంచుతోంది. ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే స్ట్రీమింగ్ కానుంది.