తెలుగు న్యూస్  /  Entertainment  /  Unstoppable With Nbk Pawan Kalyan Episode Shoot Begins Today

Unstoppable With Nbk - Pawan Kalyan: అన్‌స్టాప‌బుల్ బాల‌కృష్ణ - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ మొద‌లైంది

27 December 2022, 11:33 IST

  • Unstoppable With Nbk - Pawan Kalyan: అన్‌స్టాప‌బుల్ టాక్‌షోకు గెస్ట్‌గా టాలీవుడ్ అగ్ర హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హాజ‌రుకాబోతున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది.

అన్‌స్టాప‌బుల్ టాక్‌షో
అన్‌స్టాప‌బుల్ టాక్‌షో

అన్‌స్టాప‌బుల్ టాక్‌షో

Unstoppable With Nbk - Pawan Kalyan: అన్‌స్టాప‌బుల్ టాక్‌షో సెకండ్ సీజ‌న్‌కు ఊహించ‌ని గెస్ట్‌ల‌ను ఆహ్వానిస్తూ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు హోస్ట్ బాల‌కృష్ణ‌. ఈ షోకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రుకాబోతున్న‌ట్లు ఇటీవ‌లే ఆహా ఓటీటీ సంస్థ ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం బాల‌కృష్ణ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ జ‌రుపుతున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన స్పెష‌ల్ సెట్‌లో ఈ షూటింగ్ జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Samantha Next Movie: పుట్టిన రోజున గుడ్‍న్యూస్ చెప్పిన సమంత.. రీఎంట్రీ సినిమా ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టైటిల్, పోస్టర్

Agent OTT: ఏజెంట్ సినిమాకు సంవత్సరం: ఓటీటీలోకి ఇంకెప్పుడు?

Ramam Raghavam: దర్శకుడిగా జబర్తస్త్ కమెడియన్ ధన్‌రాజ్ ద్విభాషా చిత్రం.. తమిళ హీరో కామెంట్స్

Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

ఈ ఎపిసోడ్‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఫోన్ కాల్ ద్వారా సాయిధ‌ర‌మ్‌తేజ్ ముగ్గురితో ముచ్చ‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఈ రోజు ఈ ఎపిసోడ్ తాలూకు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ ఎపిసోడ్‌పై ఆహా అధినేత‌, నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రెండో సీజ‌న్‌లో బిగ్గెస్ట్ క్రేజీయెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ మంగ‌ళ‌వారం (నేడు) జ‌రుగుతోంది ఈ ఎపిసోడ్ గెస్ట్‌ ఎవ‌రో కాదు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ అల్లు అర‌వింద్ పేర్కొన్నారు.

ఈ షోలో పాల్గొన‌డానికి అంగీక‌రించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు అల్లు అర‌వింద్‌. ఇటువంటి టాక్ షో రాదు. ఇలాంటి బెస్ట్ ఎపిసోడు రాదు. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎపిసోడ్‌ను రిలీజ్ చేస్తాం అని అల్లు అర‌వింద్ అన్నారు.

ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బాల‌కృష్ణ ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగ‌బోతున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అన్‌స్టాప‌బుల్ టాక్‌షోకు ప్ర‌భాస్ గెస్ట్‌గా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్‌, గోపీచంద్ గెస్ట్‌లుగా హాజ‌రైన ఈ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.