తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Puri Jagannadh - Liger Movie: కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌కు ముందు పూరి జ‌గ‌న్నాథ్‌కు షాకిచ్చిన‌ లైగ‌ర్‌ ఎగ్గిబిట‌ర్లు

Puri Jagannadh - Liger Movie: కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌కు ముందు పూరి జ‌గ‌న్నాథ్‌కు షాకిచ్చిన‌ లైగ‌ర్‌ ఎగ్గిబిట‌ర్లు

12 May 2023, 13:51 IST

  • Puri Jagannadh - Liger Movie: పూరి జ‌గ‌న్నాథ్‌ను లైగ‌ర్ క‌ష్టాలు వీడ‌టం లేదు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ లైగ‌ర్ మూవీ ఎగ్జిబిట‌ర్లు, లీజ‌ర్స్ శుక్ర‌వారం ఫిలిం ఛాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో నిర‌వ‌ధిక దీక్ష‌లు మొద‌లుపెట్టారు

లైగ‌ర్ ఎగ్జిబిట‌ర్లు
లైగ‌ర్ ఎగ్జిబిట‌ర్లు

లైగ‌ర్ ఎగ్జిబిట‌ర్లు

Puri Jagannadh - Liger Movie: లైగ‌ర్ రిలీజై తొమ్మిది నెల‌లు దాటినా పూరి జ‌గ‌న్నాథ్‌ను మాత్రం ఈ సినిమా క‌ష్టాలు మాత్రం వీడ‌టం లేదు. త‌మకు న్యాయం చేయాలంటూ లైగ‌ర్ ఎగ్జిబిట‌ర్లు, లీజ‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద శుక్ర‌వారం నుంచి నిర‌వ‌ధిక దీక్ష‌లు చేస్తోన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగ‌ర్ మూవీ గ‌త ఏడాది ఆగ‌స్ట్ 25న రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ హైప్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 60 కోట్లు కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు పెద్ద మొత్తంలో న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమా న‌ష్టాల‌ను పూరి జ‌గ‌న్నాథ్ భ‌రించాలంటూ ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు. ఈ వివాదం కొన‌సాగుతుండ‌గానే పూరి జ‌గ‌న్నాథ్ త‌న నెక్స్ట్ సినిమాను మొద‌లుపెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.

హీరో రామ్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సోమ‌వారం ఈ సినిమా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఉన్న‌ట్లు స‌మాచారం. లైగ‌ర్ న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయ‌కుండానే పూరి మ‌రో సినిమా మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ని తెలిసిన లైగ‌ర్ ఎగ్జిబిట‌ర్లు, లీజ‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్‌లో నిర‌వ‌ధిక దీక్ష‌కు దిగారు. శుక్ర‌వారం నుంచి త‌మ పోరాటాన్ని మొద‌లుపెట్టారు.

త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఈ దీక్ష‌ను కొన‌సాగిస్తామ‌ని వారు పేర్కొంటున్నారు. తాము న‌ష్ట‌పోయిన మొత్తాల‌ను పూరి జ‌గ‌న్నాథ్ తిరిగి ఇవ్వాలంటూ పేర్కొంటున్నారు. వారి దీక్ష‌ల‌పై పూరి ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే. లైగ‌ర్ సినిమాలో అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టించింది. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీల‌తో క‌లిసి క‌ర‌ణ్‌జోహార్ ఈ సినిమాను నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం