OTT Movies: ఈవారం ఎంటర్టైన్ చేసే టాప్ 4 ఓటీటీ థ్రిల్లర్ సినిమాలు, సిరీసులు.. ఎక్కడ చూస్తారంటే?
04 February 2024, 13:28 IST
This Week OTT Movies Streaming: థ్రిల్లర్ జోనర్స్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే మూవీ లవర్స్‌ని ఎంటర్టైన్ చేసే టాప్ 4 బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసుల ఓటీటీ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. థ్రిల్లర్ జోనర్స్ నచ్చేవారు ఓ లుక్కేయండి..
ఈవారం ఎంటర్టైన్ చేసే టాప్ 4 ఓటీటీ థ్రిల్లర్ సినిమాలు, సిరీసులు.. ఎక్కడ చూస్తారంటే?
This Week OTT Movies: ఓటీటీ ప్రేక్షకులు, లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే థ్రిల్లర్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఈ వారం కూడా రెడీగా ఉన్నాయి. ఆద్యంతం గ్రిప్పింగ్ ఎలిమెంట్స్‌తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేసేందుకు నాలుగు బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. వాటిలో పాపులర్ హిట్ సిరీస్ నుంచి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న మూవీస్ సైతం ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఓక్కో సినిమా, దాని ఓటీటీ వివరాలు, స్ట్రీమింగ్ డేట్స్ చూసేద్దాం.
ఆర్య 3
బాలీవుడ్‌లో సూపర్ పాపులర్ యాక్షన్ థ్రిల్లర్ సిరీసులో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఆర్య వెబ్ సిరీస్. ఈ సిరీస్ నుంచి ఇప్పటికీ 2 సీజన్స వచ్చి ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు ఆర్య 3వ సీజన్ రెండో భాగం రానుంది. ఆర్య: అంతిమ్ వార్ పేరుతో ఫిబ్రవరి 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రైమ్ డ్రామా సిరీసుకు ఇది ఫైనల్ సీజన్‌కు రెండో భాగం అని మేకర్స్ తెలిపారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సిరీసులో కుటుంబం, వ్యాపార సమస్యల మధ్య డ్రగ్ మాఫియాను ఎలా రన్ చేస్తుందనే కథాంశంతో ఉండనుంది.
ఆర్య సీజన్ 3లో సుస్మితా సేన్‌తోపాటు అరుణ్, సికందర్ ఖేర్, ఇంద్రనీల్ సేన్ గుప్తా, వికాస్ కుమార్, మాయా సరావ్, గీతాంజలి కులకర్ణి, శ్వేతా పస్రిచా, వీరేన్ వజిరానీ, ప్రత్యాక్ష్ పన్వర్, ఆరుషి బజాజ్, భూపేంద్ర జడావత్, విశ్వజీత్ ప్రధాన్ తదితరులు నటించారు. అమితా మాధ్వానీ, రామ్ మధ్వానీ, రామ్ మధ్వానీ ఫిల్మ్స్, ఎండెమోల్ షైన్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఓటీటీ షోకు రామ్ మధ్వానీ దర్శకత్వం వహించారు.
భక్షక్
బాలీవుడ్ హాట్ బ్యూటి భూమి పెడ్నేకర్ తొలిసారిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్న థ్రిల్లర్ మూవీ భక్షక్. ఈ క్రైమ్ థ్రిల్లర్ జర్నలిస్ట్ వైశాలి సింగ్ (భూమి పెడ్నేకర్) చుట్టూ తిరుగుతుంది. వసతి గృహాల్లో ఉండే అనాధ బాలికలు, అమ్మాయిలు అత్యాచారానికి గురవుతుంటారు. ఈ మాఫియాను అక్కడున్న లోకల్ రౌడీ బన్సీ సాహు (ఆదిత్య శ్రీవాస్తవ) నడిపిస్తుంటాడు. ఈ మాఫియాను బయటపెట్టే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వైశాలి పాత్రలో భూమి పెడ్నేకర్ నటించింది.
ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్, రాజ్‌పాల్ యాదవ్, సూర్య శర్మ, సంజయ్ మిశ్రా తదితరులు కీలక పాత్రలు పోషించిన భక్షక్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. డైరెక్టర్ పుల్‌కిత్ దర్శకత్వం వహించారు.
కిల్లర్ పారడాక్స్
పాపులర్ నటుడు చోయ్ వూ సిక్ కాలేజ్ స్టూడెంట్ లీ టాంగ్‌గా నటించిన వెబ్ సిరీస్ కిల్లర్ పారడాక్స్. కన్వీనియన్స్ స్టోర్‌లో పార్ట్ టైమ్ పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కస్టమర్‌ను చంపినప్పుడు పరిస్థితులు మలుపు తిరుగుతాయి. తరువాత, అతను చంపిన వ్యక్తి అమాయక ప్రజలపై ఘోరమైన నేరాలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ అని తెలుసుకుంటాడు. చెడ్డవారిని గుర్తించే తన ప్రత్యేక సామర్థ్యాన్ని గ్రహించిన లీ టాంగ్ ఎలా మారాడు. కొత్త క్యారెక్టర్‌తో చెడ్డవారిని ఎలా శిక్షించడానేదే కథ. 9 ఎపిసోడ్స్‌తో ఉన్న ఈ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్
డోనాల్డ్ గ్లోవర్, మాయా ఎర్స్కిన్ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్. ఈ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రాన్సెస్కా స్లోన్, డోనాల్డ్ సంయుక్తంగా రూపొందించిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ అంతా జాన్ అండ్ జేన్ స్మిత్ అనే ఇద్దరు గూఢచారుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెన్సీలో చేరేందుకు వారు భార్యభర్తలుగా చెప్పుకుంటారు. ఫేక్ ఐడెంటిటీలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు.
అప్పుడు వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలతో ఉత్కంఠంగా తెరకెక్కిందే మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్. ఈ సిరీసులో పార్కర్ పోసీ, వాగ్నర్ మౌరా మైఖేలా కోయెల్, జాన్ టుర్టురో, పాల్ డానో, అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్ తదితరులు నటించారు. దీనిని ఫ్రాన్సెస్కా స్లోన్, డోనాల్డ్ రూపొందించారు.
టాపిక్