తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar A Certificate: సలార్‌కు ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఇదే

Salaar A Certificate: సలార్‌కు ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఇదే

Hari Prasad S HT Telugu

14 December 2023, 13:57 IST

google News
    • Salaar A Certificate: ప్రభాస్ నటించిన సలార్‌ మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ వెల్లడించాడు.
సలార్ మూవీకి ఎ సర్టిఫికెట్
సలార్ మూవీకి ఎ సర్టిఫికెట్

సలార్ మూవీకి ఎ సర్టిఫికెట్

Salaar A Certificate: ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడిన కొద్దీ ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. అయితే ఈ మధ్యే సెన్సార్ పనులు చేసుకున్న ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యం కలిగించింది. అయితే సెన్సార్ నిబంధనాల్లో వచ్చిన భారీ మార్పులు కారణంగానే తమ సినిమాకు ఇలా ఎ సర్టిఫికెట్ వచ్చినట్లు ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ చెప్పాడు.

ఇండియా టుడేతో మాట్లాడిన సలార్ ప్రొడ్యూసర్.. సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ కోసం తాము ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపాడు. ఈ మూవీలో అశ్లీలం ఏమీ లేదని కూడా స్పష్టం చేశాడు. హింస, అశ్లీలత ఎక్కువగా ఉన్న సినిమాలకు సాధారణంగా సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇస్తుంది. అంటే ఇలాంటి సినిమాలను థియేటర్లలో కేవలం 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే చూసే వీలుంటుంది.

అందుకే సలార్‌కు ఎ సర్టిఫికెట్: ప్రొడ్యూసర్

సలార్ మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందో విజయ్ కిరగండూర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. "మేము యూ/ఎ సర్టిఫికెట్ కోసమే ప్రయత్నించాం. ఎందుకంటే మా సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూడాలనుకున్నాం. అయితే ఇప్పుడు ఎ సర్టిఫికెట్ తోనూ సంతృప్తిగానే ఉన్నాం. సెన్సార్ రూల్స్ మారిపోయాయని బోర్డు సభ్యులు కారణాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

యానిమల్ విషయంలోనూ ఇదే జరిగింది. సెన్సార్ అధికారులను కలిసినప్పుడు కొన్ని కట్స్ చేస్తే యూ/ఎ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. కానీ దానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంగీకరించలేదు. ఓ హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తి అలా ఎందుకు మారాడన్నది చెప్పడానికి ఆ సీన్స్ చాలా ముఖ్యం" అని ప్రొడ్యూసర్ విజయ్ తెలిపాడు.

ఇక సలార్ మూవీలో ఎలాంటి అశ్లీలత లేదని కూడా స్పష్టం చేశాడు. నిజానికి అశ్లీలత కారణంగా కాదు.. ఇందులోనూ యాక్షన్ సీక్వెన్స్ వల్ల ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు విజయ్ కిరగండూర్ తెలిపాడు. ఎ సర్టిఫికెట్ తో రిలీజ్ అవుతున్న తొలి సినిమా సలార్ కాదని, ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం తమకు ఉందని అన్నాడు. అంతర్జాతీయంగా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉన్నట్లు కూడా తెలిపాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం