తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Veerappan Documentary In Ott : వీరప్పన్‌పై డాక్యుమెంటరీ.. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్

Veerappan Documentary In OTT : వీరప్పన్‌పై డాక్యుమెంటరీ.. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్

Anand Sai HT Telugu

28 July 2023, 10:51 IST

google News
    • The Hunt For Veerappan : వీరప్పన్‌పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరప్పన్‌పై ఓ డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో టీజర్‌ను విడుదల చేశారు.
ది హంట్ ఫర్ వీరప్పన్
ది హంట్ ఫర్ వీరప్పన్ (Twitter)

ది హంట్ ఫర్ వీరప్పన్

వీరప్పన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరప్పన్‌(Veerappan) మీద ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. ఒక్కో సినిమా ఒక్కో విధంగా వీరప్పన్ కథను చెబుతుంది. ప్రతిసారీ వీరప్పన్ గురించి తెలుసుకోవాలని చాలా మంది సినిమా చూస్తుంటారు. నెట్‌ఫ్లిక్స్ కూడా వీరప్పన్‌ను తన వేదికపైకి తెచ్చింది. వీరప్పన్‌పై ఒక డాక్యుమెంటరీ(Veerappan Documentary)ని నెట్‌ఫ్లిక్స్ నిర్మించింది. డాక్యుమెంటరీ టీజర్‌ను విడుదల చేసింది.

కర్ణాటక, తమిళనాడు అడవులు, అక్కడే ఉండేవారిని కూడా నెట్ ఫ్లిక్స్ వీరప్పన్ కథలో చూపించనుంది. రెండు దశాబ్దాలకు పైగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల్లో రెచ్చిపోయిన వీరప్పన్ డాక్యమెంటరీని తీసుకురానుంది. వీరప్పన్‌పై 'ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌'(The Hunt For Veerappan) డాక్యుమెంటరీ టీజర్‌ను జూలై 27 నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ .. 'ఆధునిక ప్రపంచం ఇలాంటి నేరస్థుడిని ఎప్పుడూ చూడలేదు. వీరప్పన్ లాంటి వ్యక్తి, నేరస్థుడు భూమిపై లేడని అంటున్నారు. రెండు రాష్ట్రాల నుంచి డబ్బులు దండుకున్నాడు. అతనిది ఉగ్రవాదం కాదు, తిరుగుబాటు కాదు. అతని అకృత్యాలను వీరప్పన్ మోడల్.' అని గుర్తించాలని చెప్పారు.

'ది హంట్ ఫర్ వీరప్పన్' అనేది డాక్యుమెంటరీలో కొంతమంది నిజమైన వ్యక్తులు, వీడియోలు, స్థలాలు, ప్రాంతాలు చూపిస్తారు. వీరప్పన్ ఆపరేషన్‌లో పాల్గొన్న కర్ణాటక(Karnataka), తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రాల అధికారుల ఇంటర్వ్యూలు, వాంగ్మూలాలు కూడా ఈ డాక్యుమెంటరీలో నమోదయ్యే అవకాశం ఉంది. టీజర్‌లో వీరప్పన్ గురించి అద్వానీ మాట్లాడిన క్లిప్‌తో సహా వీరప్పన్ అనేక వీడియో దృశ్యాలు కూడా ఉన్నాయి.

వీరప్పన్.. కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్‌ ను కిడ్నాప్ చేసి.. 108 రోజుల పాటు బందీగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లోనూ వార్తల్లో నిలిచాడు వీరప్పన్. డాక్యుమెంటరీలో దీనికి సంబంధించిన కంటెంట్, వీడియోలు కూడా ఉంటాయి. వీరప్పన్‌పై గతంలో కొన్ని సినిమాలు(Verappan Movies) వచ్చాయి. ఆ సినిమాలు చెప్పకుండా వదిలేసిన ఎన్నో సంఘటనలను ఈ డాక్యుమెంటరీ తెరపైకి తెస్తుందేమో చూడాలి. ఆగస్టు 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగులోనూ వీరప్పన్ పై సినిమా వచ్చింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కిల్లింగ్ వీరప్పన్ పేరుతో సినిమా తీశాడు. కన్నడ, తమిళంలోనూ సినిమా వచ్చాయి. పుస్తకాలు రాశారు. ఇప్పుడు తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తొలిసారిగా.. డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధంగా ఉంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం