తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Boyapati Srinu Vs Thaman: అప్పుడు దేవి...ఇప్పుడు త‌మ‌న్ - బోయ‌పాటికి గ‌ట్టి కౌంట‌ర్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌

Boyapati Srinu vs Thaman: అప్పుడు దేవి...ఇప్పుడు త‌మ‌న్ - బోయ‌పాటికి గ‌ట్టి కౌంట‌ర్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌

08 October 2023, 16:52 IST

  • Boyapati Srinu vs Thaman: స్కంద సినిమా విష‌యంలో త‌మ‌న్ మ్యూజిక్‌పైనే ఎక్కుగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తోన్నాయ‌ని ఇటీవ‌ల డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కామెంట్స్ చేశాడు. అఖండ సినిమా త‌మ‌న్ ఆర్ఆర్ లేకుండా చూసిన గొప్పగా ఉంటుంద‌ని అన్నాడు. బోయ‌పాటి కామెంట్స్‌పై త‌మ‌న్  గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

త‌మ‌న్, బోయ‌పాటి శ్రీను
త‌మ‌న్, బోయ‌పాటి శ్రీను

త‌మ‌న్, బోయ‌పాటి శ్రీను

Boyapati Srinu vs Thaman: త‌న మ్యూజిక్‌ఫై నెగెటివ్ కామెంట్స్ చేసిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుకు త‌మ‌న్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. ఆదివారం త‌మ‌న్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్కంద రిలీజ్ త‌ర్వాత ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్ మ్యూజిక్‌పై బోయ‌పాటి శ్రీను ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

స్కంద సినిమాలో త‌మ‌న్ మ్యూజిక్‌పైనే ఎక్కువ‌గా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తోన్నాయ‌ని బోయ‌పాటి శ్రీను పేర్కొన్నాడు. అంతే కాకుండా త‌న బీజీఎమ్‌తో అఖండ సినిమాకు త‌మ‌న్ ప్రాణంపోశాడ‌నే మాట‌లు అబ‌ద్ధ‌మ‌ని బోయ‌పాటి శ్రీను అన్నాడు.

ఆర్ ఆర్ లేకుండా చూసిన అఖండ అంతే గొప్ప‌గా ఉంటుంద‌ని, అంత‌టి ద‌మ్ము ఉన్న క‌థ అద‌ని బోయ‌పాటిశ్రీను అన్నాడు. త‌మ‌న్ మ్యూజిక్‌పై బోయ‌పాటి శ్రీను చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఆదివారం ట్విట్ట‌ర్‌లో త‌మ‌న్ ట్విట్ట‌ర్‌లో ఐ డోంట్ కేర్ అంటూ ట్వీట్ చేశాడు.

బోయ‌పాటి కామెంట్స్‌ను ఉద్దేశించే త‌మ‌న్ ఈ ట్వీట్ చేసిన‌ట్లు నెటిజ‌న్లు చెబుతోన్నారు. త‌న ట్వీట్ ద్వారా బోయ‌పాటికి త‌మ‌న్ స్ట్రాంగ్‌ కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు చెబుతోన్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం బోయ‌పాటి శ్రీనుకు ఇది కొత్తేం కాదు. గ‌తంలో లెజెండ్ సినిమా ఈవెంట్‌లో దేవిశ్రీప్ర‌సాద్‌తో ప‌ట్టుబ‌ట్టి తానే మ్యూజిక్ చేయించుకున్నానంటూ అత‌డిని త‌క్కువ చేసి మాట్లాడాడు. అదే ఈవెంట్‌లో బోయ‌పాటికి దేవిశ్రీప్ర‌సాద్ కౌంట‌ర్ ఇచ్చాడు.

ఇంగ్లీష్ సినిమాలు చూడ‌టం త‌ప్ప త‌న‌కు బోయ‌పాటి ఎలాంటి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌లేదంటూ పేర్కొన‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను సినిమాల‌కు దేవిశ్రీప్ర‌సాద్ దూరంగా ఉంటూ వ‌చ్చాడు. అఖండ కామెంట్స్‌తో బోయ‌పాటికి త‌మ‌న్ కూడా హ్యాండ్ ఇవ్వ‌డం గ్యారెంటీగానే క‌నిపిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం