తెలుగు న్యూస్  /  Entertainment  /  Tamannaah Says Success And Failure In The Film Industry Are Not Permanent.

Tamannaah: క‌ష్టాల్లో వారే స‌పోర్ట్ చేశారు - సినీ కెరీర్‌పై త‌మ‌న్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

12 August 2022, 15:53 IST

  • సినీ పరిశ్రమలో వేసే ప్రతి అడుగు ఎన్నో పాఠాలను నేర్పుతుందని అంటోంది తమన్నా. పదిహేడేళ్ల ప్రయాణంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పింది. తన సినీ ప్రయాణాన్ని గురించి తమన్నా ఏమన్నదంటే..

తమన్నా
తమన్నా (instagram)

తమన్నా

పదిహేడేళ్ల సినీ కెరీర్ లో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ తాత్కాలికమేనని పేర్కొన్నది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో 2005లో కథానాయికగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. తొలి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ భాషల్లో చక్కటి అవకాశాలను అందుకుంటూ తమన్నా అగ్రహీరోయిన్ గా మారిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Top Releases in May: మే నెలలో ఓటీటీల్లో 5 ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే.. సూపర్ హిట్ సినిమాలు.. ఓ భారీ వెబ్ సిరీస్

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!

తన సినీ ప్రయాణాన్ని గురించి తమన్నా మాట్లాడుతూ సినీ పరిశ్రమలో వేసే అడుగు ఎంతో ముఖ్యమనదైని తెలిపింది. ఎన్నో పాఠాలను నేర్పుతుందని చెప్పింది. ప్రతి బాల్ సిక్స్ కొట్టాలంటే కుదరదు అని అన్నది.

‘ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎంతో మంది సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుంది. సినిమా జయాపజయాలను అనేక అంశాలు నిర్ణయిస్తాయి. విజయమైనా, పరాజయమైన నటీనటులు ఒక్కరి వల్లే దక్కదు. వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటే ఇండస్ట్రీలో ముందుకు సాగలేము. ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్ ఏది పర్మినెంట్ కాదు. హిట్ దక్కిందని ఆనందపడేలోపు పరాజయం పలకరించి బాధపెడుతుంది’ అని తెలిపింది. తన కెరీర్ లో అంతులేని బాధను, ఆవేదనను అనుభవించిన క్షణాలు చాలా ఉన్నాయని తమన్నా చెప్పింది. కుటుంబసభ్యులు స్నేహితుల సపోర్ట్ తో ఎత్తుపల్లాల నుంచి బయటపడగలిగానని పేర్కొన్నది.

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సత్యదేవ్ తో కలిసి గుర్తుందాశీతాకాలం సినిమా చేస్తోంది. వీటితో బాలీవుడ్ తో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.