Tamannaah Marriage: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా - పెళ్లి రూమర్స్‌పై క్లారిటీ
17 November 2022, 12:05 IST
Tamannaah Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి రూమర్స్‌పై తమన్నా ఫన్నీగా స్పందించింది. తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది.
తమన్నా
Tamannaah Marriage: దక్షిణాది సీనియర్ కథానాయికలు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలెక్కుతున్నారు. కాజల్ గత ఏడాది పెళ్లి చేసుకోగా , నయనతార చిరకాల ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో ఈ ఏడాది ఏడడుగులు వేసింది. హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా తన భర్తను అభిమానులకు పరిచయం చేసింది. పెళ్లి కావాల్సిన సీనియర్ హీరోయిన్ల జాబితాలో కేవలం తమన్నా మాత్రమే మిగిలి ఉంది.
త్వరలోనే తమన్నా కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే తమన్నా సినిమాల్ని తగ్గించినట్లు చెబుతోన్నారు. పెద్దలు కుదిర్చిన వివాహానికే మిల్కీ బ్యూటీ ఒకే చెప్పిందంటూ కథనాలు వచ్చాయి. ఈ పెళ్లి వార్తలపై ఫన్నీగా తమన్నా స్పందించింది. నా బిజినెస్మెన్ హజ్బెండ్ ఇతడే అంటూ ఎఫ్ 3 సినిమాలో మగరాయుడిగా తాను కనిపించిన వీడియోను అభిమానులతో పంచుకున్నది.
తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌కు ఫన్నీగా పుల్‌స్టాప్ పెట్టింది తమన్నా. ఎఫ్ 3 సినిమాలో డబ్బు కోసం మగరాయుడిగా వేషం ధరించే పాత్రలో కనిపించింది తమన్నా. సెకండాఫ్‌లో దాదాపు 30 నిమిషాల పాటు ఈ క్యారెక్టర్లో ఆమె కనిపిస్తుంటుంది. ఈ క్యారెక్టర్ కోసం కారా వ్యాన్‌లో రెడీ అవుతోన్న పాత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా షేర్ చేసింది.
ప్రస్తుతం తెలుగులో తమన్నా భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా కనిపించబోతున్నది. అలాగే సత్యదేవ్ తమన్నా జంటగా నటిస్తోన్న గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ ఉంది. మరోవైపు వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది.