తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.., ఇంకా మిస్టరీగానే..!

Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.., ఇంకా మిస్టరీగానే..!

Anand Sai HT Telugu

21 January 2023, 10:38 IST

google News
    • Sushant Singh Rajput Birth Anniversary : బాలీవుడ్ లో ఎంతో ఫ్యూచర్ ఉన్న స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఏమైందో.. ఆకస్మాత్తుగా ఉరి వేసుకుని శవమై కనిపించాడు. జనవరి 21 అతడి జయంతి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (twitter)

సుశాంత్ సింగ్ రాజ్ పుత్

2020 జూన్ 14 ముంబయి(Mumbai)లోని బాంద్రా నివాసంలో బాలీవుడ్(Bollywood) నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్(sushant singh rajput) ఉరి వేసుకుని కనిపించాడు. మెుదట ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు.. కుటుంబ సభ్యులు.. అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సుశాంత్ సింగ్ మృతిపై అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నెపోటిజం కారణంగానే అవకాశాలు తగ్గిపోయాయని, అందుకే ఆత్మహత్య అని కొంతమంది చెప్పుకొచ్చారు. లేదు లేదు.. రియా చక్రవర్తి కారణంగానే ఇలా జరిగిందంటూ.. మరికొంతమంది అన్నారు. ఆమె అరెస్టు కూడా అయింది.

అయితే సుశాంత్(Sushant) చనిపోయి రెండున్నరెళ్లు అవుతున్నా.. ఇంకా అతడిని ప్రజలు గుర్తు చేస్తూనే ఉంటారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మెుదట ముంబయి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తర్వాత ఒత్తిడి పెరగడంతో కేసును సీబీఐ(CBI)కి అప్పగించారు. ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదు. దీనిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతిపై హత్య ఆరోపణలు వచ్చాయి. అయితే సుశాంత్ సింగ్ పోస్టుమార్టంలో పాల్గొన్న కూపర్ హాస్పిటల్(Cooper Hospital) సిబ్బంది ఇప్పుడు చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(Sushant Singh Rajput Suicide) చేసుకోలేదని, హత్య చేశారని కూపర్ హాస్పిటల్‌లోని మార్చురీలో పనిచేసిన రూపకుమార్ షా ఆరోపించారు. 'సుశాంత్ మృతదేహం వచ్చినప్పుడు, అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని ఎవరో కొట్టారు.'అని రూపకుమార్ చెప్పారు.

'సుశాంత్ సింగ్(sushant singh rajput) మృతదేహానికి పోస్టుమార్టం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇది ఆత్మహత్య(Suicide) కాదని, హత్య అని డాక్టర్‌కి చెప్పాను. కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు' అని రూపకుమార్ అన్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు. 'పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత సేపు మాట్లాడలేదు' అన్నారు. కూపర్ హాస్పిటల్ మార్చురీలో రూపకుమార్ పనిచేశాడు. నెలన్నర క్రితం పదవీ విరమణ చేశారు.

ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి(rhea chakraborty) ప్రధాన నిందితురాలుగా ఉంది. ఈ కేసులో అరెస్టై బెయిల్ మంజూరైంది. విచారణలో, 'ఏయూ' అనే వ్యక్తి నుండి రియాకు 44 కాల్స్ వచ్చినట్టుగా తెలిసింది. ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బీహార్ పోలీసులు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జయంతి సందర్భంగా అతడి సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తుచేసుకుంది. ఎమోషనల్ పోస్ట్ చేసింది. సుశాంత్ తన మేనల్లుడు, మేనకోడలుతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసుకుంది. 'హ్యాపీ బర్త్‌డే భాయ్. మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీరు కిందకి చూసి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి.' అంటూ పోస్ట్ చేసింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం