తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Bobby Deol: సూర్య కంగువలో యానిమల్ విలన్.. అత్యంత క్రూరుడిగా బాబీ డియోల్

Kanguva Bobby Deol: సూర్య కంగువలో యానిమల్ విలన్.. అత్యంత క్రూరుడిగా బాబీ డియోల్

Sanjiv Kumar HT Telugu

28 January 2024, 7:41 IST

  • Bobby Deol Kanguva First Look Out: తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ సినిమా కంగువలో యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన బాబీ డియోల్ కంగువ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

సూర్య కంగువలో యానిమల్ విలన్.. అత్యంత క్రూరుడిగా బాబీ డియోల్
సూర్య కంగువలో యానిమల్ విలన్.. అత్యంత క్రూరుడిగా బాబీ డియోల్

సూర్య కంగువలో యానిమల్ విలన్.. అత్యంత క్రూరుడిగా బాబీ డియోల్

Bobby Deol As Adhiran In Kanguva: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. కంగువ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో వస్తున్న కంగువ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రెండింగ్ వార్తలు

Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్

Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

కొత్త అవతారంలో సూర్య

కంగువ సినిమాలో సూర్య పాత్ర ఎలా ఉంటుందో ఇప్పటికే స్పెషల్ గ్లింప్స్ ద్వారా చూపించారు. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ అని టాక్ తెచ్చుకుంది. దాంతో కంగువ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇక ఎన్నడూ చూడని కొత్త అవతారంలో సూర్యను చూపిస్తున్నారు డైరెక్టర్ శివ. దాంతో సూర్య కంగువ మూవీపై ఇప్పటికే భారీగా బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు తాజాగా కంగువలోని మరో పాత్రను రివీల్ చేశారు మేకర్స్.

ఉధిరన్ లుక్ రివీల్

కంగువలో సూర్యకు విలన్‌గా అదిరిపోయే యాక్టర్‌ను తీసుకున్నారు. కంగువలో సూర్యకు ప్రతినాయకుడిగా యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ నటించనున్నాడు. కంగువ మూవీలో ఉధిరన్ అనే పవర్ ఫుల్ పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నాడు. జనవరి 27న బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా 'కంగువ' సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఉధిరన్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. 'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్ ..' అంటూ ఉధిరన్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ బాబీ డియోల్‌కు బర్త్ డే విశెస్ చెప్పారు మేకర్స్.

చుట్టూ మహిళలతో

కంగువలోని ఈ పోస్టర్‌లో బాబీ డియోల్ ఉధిరన్‌గా యూనిక్ మేకోవర్‌లో కనిపిస్తున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్‌కు ఆయన వర్గం ప్రజలంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. చుట్టూ మహిళలతో ఒక కన్ను సరిగా లేకుండా అత్యంత క్రూరుడిగా బాబీ డియోల్ లుక్ అదిరిపోయింది. బాబీ డియోల్ పొడవాటి జుట్టుతో, కొమ్ములతో, చొక్కాపై పక్కటెముకతో లుక్ క్రూరంగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో బాబీ డియోల్ కంగువ లుక్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

హ్యాపీ బర్త్ డే బ్రదర్

బాబీ డియోల్ పోస్టర్ లుక్‌కు ఇచ్చిన క్యాప్షన్ కూడా హైలెట్‌గా ఉంది. రూత్ లెస్, పవర్ ఫుల్ అంటూ ఎప్పటికీ మర్చిపోలేరు అన్న అర్థంలో పోస్టర్ షేర్ చేశారు. ఇక బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా సూర్య కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. "హ్యాపీ బర్త్ డే డియర్ బ్రదర్ బాబీ డియోల్. నీ ఆత్మీయ స్నేహానికి ధన్యవాదాలు. మన కంగువ సినిమాలో అత్యంత శక్తివంతమైన ఉధిరన్‌గా మిమ్మల్ని చూడటం అద్భుతంగా ఉంది" అని సూర్య ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ప్రకటించని రిలీజ్ డేట్

విజువల్ వండర్‌‌గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతోంది. ఇప్పటివరకు కంగువ విడుదల తేదిని మేకర్స్ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే యానిమల్ మూవీలో విలన్‌గా బాబీ డియోల్ తన నటనతో అదరగొట్టాడు. దాంతో బాబీ డియోల్‌కు సౌత్ ప్రేక్షకులు సైతం అభిమానులుగా మారారు. ఇప్పుడు కంగువలో తన నటనతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Suriya too, shared the poster.
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం