తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Superstar Krishna Mahesh Babu Movies: కృష్ణ‌, మ‌హేష్‌బాబు క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా...

Superstar Krishna Mahesh Babu Movies: కృష్ణ‌, మ‌హేష్‌బాబు క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా...

15 November 2022, 8:00 IST

  • Superstar Krishna Mahesh Babu Movies: మ‌హేష్‌బాబును ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి అత‌డిని ఓ మంచి న‌టుడిగా తీర్చిదిద్దారు కృష్ణ‌. తండ్రిగానే కాకుండా న‌ట‌గురువుగా, మార్గ‌ద‌ర్శిగా మ‌హేష్‌బాబు సినీ ప్ర‌యాణంలో కీల‌క భూమిక పోషించాడు. తండ్రీకొడుకుల క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాలు ఎన్నంటే...

కృష్ణ, మ‌హేష్‌బాబు
కృష్ణ, మ‌హేష్‌బాబు

కృష్ణ, మ‌హేష్‌బాబు

Superstar Krishna Mahesh Babu Movies: తండ్రిని మించిన గురువు ఉండ‌డ‌ని చాలామంది అంటుంటారు. మ‌హేష్‌బాబు విష‌యంలో ఆ మాట మాత్రం నిజ‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌హేష్‌బాబు అగ్ర‌క‌థానాయ‌కుడిగా ఎద‌గ‌డంతో తండ్రి కృష్ణ పాత్ర ఎక్కువ‌గా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌హేష్‌బాబు చేత యాక్టింగ్‌లో ఓన‌మాలు దిద్దించారు కృష్ణ‌. మంచి న‌టుడిగా అత‌డిని తీర్చిదిద్దారు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

న‌ట శిక్ష‌కుడిగా, మార్గ‌ద‌ర్శిగా మ‌హేష్‌బాబు వెన్నంటి నిలిచారు కృష్ణ‌. మ‌హేష్‌బాబు కెరీర్ ప్రారంభ‌మైంది కృష్ణ సినిమాల‌తోనే కావ‌డం గ‌మ‌నార్హం. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పోరాటం సినిమాలో కృష్ణ త‌మ్ముడి పాత్ర‌లో తొలిసారి మ‌హేష్‌బాబు బాల‌న‌టుడిగా వెండితెర‌పై అరంగేట్రం చేశాడు. మ‌హేష్ బాబు ఈ పాత్ర‌కు స‌రిపోతాడ‌ని కోడి రామ‌కృష్ణ బ‌ల‌వంత పెట్ట‌డంతో కృష్ణ అంగీక‌రించారు. అలా మ‌హేష్ తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు.

మ‌హేష్‌బాబుకు న‌ట‌న ప‌ట్ల ఇష్టాన్ని గ‌మ‌నించిన కృష్ణ కొడుకు ఆస‌క్తికి అడ్డుచెప్ప‌లేదు. కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో మ‌హేష్‌బాబు కీల‌క పాత్ర‌లు చేశాడు. ముగ్గురు కొడుకులు సినిమాలో కృష్ణ, ర‌మేష్‌బాబు, మ‌హేష్‌బాబు అన్నాద‌మ్ములుగా న‌టించ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో శంఖారావం, గూఢ‌చారి 117, అన్నాత‌మ్ముడు, సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాల‌న్నింటిలో కృష్ణ హీరోగా న‌టిస్తే మ‌హేష్‌బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌ పాత్ర‌లు పోషించాడు. ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన రాజ‌కుమారుడు, వంశీ సినిమాల్లో కృష్ణ కీల‌క పాత్ర‌లు చేశాడు. త‌న మ‌న‌వ‌డు, మ‌హేష్‌బాబు త‌న‌యుడు గౌత‌మ్‌తో సినిమా చేయాల‌ని కృష్ణ క‌ల‌లు క‌న్నారు. కానీ ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం