తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ayalaan Ott Release: అఫీషియ‌ల్ - నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి అయ‌లాన్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Ayalaan OTT Release: అఫీషియ‌ల్ - నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి అయ‌లాన్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

27 January 2024, 14:07 IST

  • Ayalaan OTT Release: శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డీటెయిల్స్‌ను స‌న్ నెక్స్ట్ శ‌నివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది.

శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ మూవీ
శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ మూవీ

శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ మూవీ

Ayalaan OTT Release: శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స‌న్ నెక్స్ట్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ను శ‌నివారం స‌న్ సెక్స్ట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి 9 నుంచి ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ఓటీటీలో విడుద‌ల‌కానున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాలం, క‌న్న‌డంతో పాటు హిందీలోనూ అయ‌లాన్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

తెలుగులో రిలీజ్ ఆల‌స్యం...

అయ‌లాన్ త‌మిళ వెర్ష‌న్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సంక్రాంతికి తెలుగులో గుంటూరు కారం, సైంధ‌వ్‌, నా సామిరంగ‌తో పాటు హ‌నుమాన్ రిలీజ్ కావ‌డంతో అయ‌లాన్‌కు థియేట‌ర్లు దొర‌కలేద‌. దాంతో తెలుగు వెర్ష‌న్‌ను రెండు వారాలు ఆల‌స్యంగా జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేయాల‌ని భావించారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో శివ‌కార్తికేయ‌న్ కూడా పాల్గొన్నాడు.

లీగ‌ల్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఫిబ్ర‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో ఈ మూవీ విడుద‌ల‌కాలేదు. బుకింగ్స్ బాగానే జ‌రిగినా స్క్రీనింగ్‌కు అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆ డ‌బ్బులు వెన‌క్కి తిరిగి ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 2లోగా లీగ‌ల్ ఇష్యూస్ క్లియ‌ర్ చేసే ప‌నిలో సినిమా యూనిట్ ఉన్న‌ట్లు స‌మాచారం. అప్ప‌టిలోగా కూడా స‌మ‌స్య‌లు కొలిక్కి రాక‌పోతే తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.

నెల రోజుల్లోనే ఓటీటీలోకి...

త‌మిళ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజులు కూడా కాక‌ముందే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అయ‌లాన్ మూవీ 15 రోజుల్లో అర‌వై కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. సంక్రాంతికి రిలీజైన త‌మిళ సినిమాల్లో కెప్టెన్ మిల్ల‌ర్ త‌ర్వాత హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా అయ‌లాన్ నిలిచింది.

అయ‌లాన్ క‌థ ఇదే...

ప్ర‌పంచ వినాశ‌నానికి ప్లాన్ చేసిన సైంటిస్ట్ కుట్ర‌ను ఏలియ‌న్ స‌హాయంతో ఓ యువ‌కుడు ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే అయ‌లాన్ మూవీ క‌థ‌. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ హంగుల‌తో ఆర్ ర‌వికుమార్ అయ‌లాన్ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో దాదాపు 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అత్య‌ధిక వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఇండియ‌న్ మూవీ అయ‌లాన్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఎనిమిదేళ్ల పాటు షూటింగ్‌...

గ్రాఫిక్స్ ప‌నుల కార‌ణంగానే అయ‌లాన్‌ షూటింగ్ ఆల‌స్య‌మైంది. అయ‌లాన్ మూవీ షూటింగ్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో ఎలియ‌న్ పాత్ర‌కు సిద్ధార్థ్ వాయిస్ ఓవ‌ర్ అందించాడు.

హీరో శివ‌కార్తికేయ‌న్‌తో పాటు సిద్ధార్థ్ ఎలాంటి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ఈ సినిమాకు ఉచితంగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. అయ‌లాన్ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు.అయ‌లాన్ మూవీలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ న‌టించింది. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీతోనే ర‌కుల్ ప్రీత్‌సింగ్ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.

అయ‌లాన్ 2

అయ‌లాన్‌కు కొన‌సాగింపుగా అయ‌లాన్ 2 మూవీని తెర‌కెక్కించారు. ఇటీవ‌లే నిర్మాత‌లు సీక్వెల్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్‌లో గ్రాఫిక్స్ కోస‌మే దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది అయ‌లాన్ 2 మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

అయ‌లాన్ త‌ర్వాత డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీతో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు. శివ‌కార్తికేయ‌న్‌. మిల‌ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ కే 21 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం