తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suma Kanakala | నాగ‌శౌర్య‌తో పోటీప‌డుతున్నసుమ‌... ‘జ‌య‌మ్మ పంచాయతీ’ రిలీజ్ డేట్ వెల్లడి..

Suma Kanakala | నాగ‌శౌర్య‌తో పోటీప‌డుతున్నసుమ‌... ‘జ‌య‌మ్మ పంచాయతీ’ రిలీజ్ డేట్ వెల్లడి..

Nelki Naresh HT Telugu

14 March 2022, 15:49 IST

  • యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

సుమ కనకాల
సుమ కనకాల (instagram)

సుమ కనకాల

టాలీవుడ్ లో నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ కనకాల. ఆమె లేకుండా అగ్ర హీరోల ప్రీ రిలీజ్ వేడుకల్నిఊహించలేమంటే అతిశయోక్తి కాదు. దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో హీరోయిన్ గా సుమ సినీ కెరీర్ మొదలైంది. కానీ నటిగా కంటే యాంకర్ గానే సక్సెస్ కావడంలో ఎక్కువగా సినిమాలు చేయలేదు. సుదీర్ఘ విరామం తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జయమ్మ అనే మహిళ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. సోమవారం ఈ సినిమా రిలీజ్ డేట్ ను వెల్లడించారు. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అదే రోజు నాగశౌర్య హీరోగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ విడుదలకాబోతున్నది. ‘జయమ్మ పంచాయితీ’ చిత్రానికి విజయ్ కుమార్ క లివారపు దర్శకత్వం వహిస్తున్నారు. బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. సుమతో ఉన్న అనుబంధం కారణంగా అగ్ర హీరోలు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. టైటిట్, ఫస్ట్ లుక్ ను రామ్ చరణ్ విడుదలచేశాడు. టీజర్ ను రానా, ఫస్ట్ సింగిల్ ను నాని ఆవిష్కరించారు. నటిగా ఈ సినిమా సుమకు ఎలాంటి బ్రేక్ నిస్తుందో చూడాల్సిందే

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం