Maa Nanna Superhero: మహేష్‌బాబు బావ సినిమాకు జీరో కలెక్షన్స్ - పండుగ రోజు షాకిచ్చిన తెలుగు ఆడియెన్స్!
13 October 2024, 9:52 IST
Maa Nanna Superhero: సుధీర్‌బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ మౌత్ టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో దక్కించుకోలేకపోతుంది. రెండు రోజుల్లో ఇరవై లక్షల లోపే కలెక్షన్స్ రాబట్టింది. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ఈ మూవీకి అభిలాష్ కంకర దర్శకత్వం వహించాడు.
మా నాన్న సూపర్ హీరో
Maa Nanna Superhero: సుధీర్‌బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజైంది. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ఈ మూవీ టాక్ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ రావడం లేదు. వేట్టయన్, విశ్వం కారణంగా మా నాన్న సూపర్ హీరో మూవీకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా థియేటర్లు దొరకలేదు.
మరోవైపు సినిమాపై అంతగా బజ్ లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. పండుగ రోజు నైజాం ఏరియాలో మా నాన్న సూపర్ హీరో మూవీ ఆడుతోన్న థియేటర్లు చాలా వరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. నైజాం ఏరియాలో శనివారం రోజు ఈ మూవీకి జీరో కలెక్షన్స్ వచ్చినట్లు చెబుతోన్నారు.ఆంధ్రా ఏరియాలో మాత్రం మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. అటు ఇటుగా ఐదు లక్షల లోపే కలెక్షన్స్ ఉంటాయని సమాచారం.
రెండు రోజుల్లో ఇరవై లక్షలు...
ఆదివారం రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో హైదరాబాద్‌లో వందలోపే టికెట్లు అమ్ముడుపోయాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో మార్నింగ్ షోస్ సీట్స్ మొత్తం ఖాళీగా కనిపిస్తోన్నాయి. శుక్రవారం రోజు ఈ సినిమా 13 లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో ఇరవై లక్షల లోపే మా నాన్న సూపర్ హీరో మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
దాదాపు నాలుగున్న కోట్ల వరకు మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోంది.
తండ్రీకొడుకుల అనుబంధం...
మా నాన్న సూపర్ హీరో మూవీకి అభిలాష్ కంకర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుధీర్‌బాబుతో పాటు షాయాజీ షిండే, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. సొంత తండ్రి, దత్తత తీసుకున్న తండ్రి...వీరిద్దరి మధ్య ఓ కొడుకు ప్రయాణం ఎలా సాగిందనే పాయింట్‌తో దర్శకుడు ఈ మూవీనితెరకెక్కించాడు.
జానీ ప్రయాణం...
జానీ (సుధీర్ బాబు) చిన్నతనంలోనే తల్లికి దూరమవుతాడు. తండ్రి జైలుకువెళతాడు. శ్రీనివాస్(షాయాజీ షిండే)... జానీని దత్తత తీసుకుంటాడు. జానీ వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఆర్థికంగా చాలా నష్టపోతాడు. అందుకు కొడుకే కారణమని జానీని ద్వేషిస్తుంటాడు శ్రీనివాస్. ఓ పొలిటీషియన్ కారణంగా శ్రీనివాస్ జైలుపాలవుతాడు.
తండ్రిని ఆ కేసు నుంచి బయటపడేయాలంటే జానీకి కోటి రూపాయలు అవసరవుతాయి. ఆ డబ్బు కోసం ప్రకాష్ (సాయిచంద్) అనే వ్యక్తితో కలిసి జానీ కేరళ వెళతాడు జానీ. ప్రకాష్ ఎవరు? అతడితో జానీకి ఉన్న సంబంధం ఏమిటి? తన సొంత తండ్రిని జానీ కలుసుకున్నాడా లేదాఅనే అంశాలతో ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కింది.
హరోంహర, హంట్ కూడా...
మా నాన్న సూపర్ హీరో కంటే ముందు సుధీర్‌బాబు నటించిన హరోంహర, మామ మశ్రీంద్ర, హంట్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.