తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli On Ntr : ఎన్టీఆర్ కనుబొమ్మలతో నటించగలడు

SS Rajamouli On NTR : ఎన్టీఆర్ కనుబొమ్మలతో నటించగలడు

Anand Sai HT Telugu

09 January 2023, 9:28 IST

    • SS Rajamouli and NTR : లాస్ ఏంజిల్స్‌లో RRR స్క్రీనింగ్‌ తర్వాత.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఎన్టీఆర్ కు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాడని చెప్పాడు.
ఎన్టీఆర్, రాజమౌళి
ఎన్టీఆర్, రాజమౌళి (twitter)

ఎన్టీఆర్, రాజమౌళి

జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్‌లో జరిగిన RRR స్క్రీనింగ్‌కు ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గోల్డెన్‌ గ్లోబ్స్‌లో రెండు కేటగిరీల్లో నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కింద నామినేట్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

జనవరి 10న Golden Globes 2023కి ముందు.. జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని DGA థియేటర్‌లో RRR స్క్రీనింగ్‌కు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చూసి.. చప్పట్లు కొట్టారు. సినిమా బృందాన్ని ప్రశంసించారు.

సినిమా స్క్రీనింగ్ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ ప్రశ్నోత్తరాల సెషన్‌కు కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలోని నాటు నాటు తనకు ఇష్టమైన పాట అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే దానికిమించి.. కొమురం భీముడో పాట అంటే ఎక్కువగా ఇష్టమని చెప్పాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను రాజమౌళి ప్రశంసించాడు. 'తారక్ నటించిన కొమురం భీముడో.. పాట నేను తీసిన అన్ని చిత్రాలలో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాటకు నేను దర్శకత్వం వహించడం గొప్ప విషయం. మనం ఎన్టీఆర్ కనుబొమ్మపై కెమెరా ఉంచితే.. అతను ఆ కనుబొమ్మతో నటించగలడు. చాలా మంచి నటుడు' అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పటికే ఈ మూవీ ఆస్కార్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను కూడా అకాడెమీ అధికారికంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీ కోసం షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆస్కార్స్‌ రేసులో నిలిచాడు. ప్రపంచంలోని పాపులర్‌ మ్యాగజైన్లలో ఒకటైన వెరైటీ అంచనా ప్రకారం ఆస్కార్స్‌ రేసులో ఉన్న టాప్ 10 బెస్ట్‌ యాక్టర్స్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఉన్నాడు.

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు తారక్‌ కావడం విశేషం. గతంలో ఏ ఇతర భారతీయ నటుడు ఇలా టాప్‌10 రేసులోకి రాలేదు. ఆర్ఆర్ఆర్‌లో అతడు పోషించిన భీమ్‌ పాత్ర చూసి ఎంతో మంది హాలీవుడ్‌ ప్రముఖులు ఫిదా అయ్యారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం