తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli On Hrithik Roshan : ప్రభాస్‌ ముందు హృతిక్ రోషన్ నథింగ్.. కామెంట్స్‎పై రాజమౌళి క్లారిటీ

Rajamouli On Hrithik Roshan : ప్రభాస్‌ ముందు హృతిక్ రోషన్ నథింగ్.. కామెంట్స్‎పై రాజమౌళి క్లారిటీ

Anand Sai HT Telugu

16 January 2023, 14:30 IST

google News
    • Rajamouli  On Hrithik Roshan Comments : 2009లో రాజమౌళి ప్రభాస్‌ను హృతిక్ రోషన్‌తో పోల్చాడు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే NYFCC అవార్డ్స్‌లో అప్పుడు చేసిన కామెంట్స్ మీద స్పందించాడు రాజమౌళి.
రాజమౌళి
రాజమౌళి

రాజమౌళి

ఆర్ఆర్ఆర్(RRR) చిత్రానికి పలు ఇంటర్నేషనల్ అవార్డులు వస్తున్నాయి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్(Golden Globe) పురస్కారాన్ని దక్కించుకున్న ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును చేజిక్కించుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆర్ఆర్ఆర్ పురస్కారాన్ని గెల్చుకుంది. ఆ పురస్కారాన్ని రాజమౌళి(Rajamouli) అందుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. రాజమౌళి గతంలో హృతిక్ రోషన్(Hrithik Roshan) మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై దర్శకదీరుడు రెస్పాండ్ అయ్యాడు.

2009 సమయంలో బిల్లా సినిమా(Billa Movie) విడుదలకు ముందు రాజమౌళి హృతిక్ మీద కామెంట్స్ చేశాడు. బిల్లా ఆడియో, ట్రైలర్ లాండ్ ఈవెంట్లో ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అంటూ వ్యాఖ్యానించాడు. తెలుగు సూపర్ స్టార్‌ ప్రభాస్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో పోల్చాడు.

'రెండేళ్ల క్రితం ధూమ్ 2 విడుదలైనప్పుడు, బాలీవుడ్‌ మాత్రమే ఇంత నాణ్యమైన సినిమాలు ఎందుకు తీయగలవని నేను ఆశ్చర్యపోయాను. హృతిక్ రోషన్(Hrithik Roshan) వంటి హీరోలు మనకు లేరా? నేను బిల్లా పాటలు, పోస్టర్ మరియు ట్రైలర్ చూశాను. ఒక్కటి మాత్రమే చెప్పగలను. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్.' అని బిల్లా సినిమా సమయంలో రాజమౌళి కామెంట్స్ చేశాడు.

అయితే, ఇటీవల ఆ పాత వీడియో వైరల్ అయ్యింది. కొంతమంది నిజమే అని అంటుంటే.. మరికొంతమంది రాజమౌళి మీద విమర్శలు చేశారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో పాత క్లిప్ గురించి దర్శకుడు రాజమౌళిని అడిగారు. ఈ వేడుకలో తన గత ప్రకటనపై స్పందించాడు. 'ఇది చాలా కాలం క్రితం. 15-16 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను. నేను చెప్పింది వేరు.. అది వెళ్లిన విధానం వేరు.. నా మాటల ఎంపిక మంచిది కాదు. దానిని అంగీకరించాలి. నా ఉద్దేశం కించపరచడం కాదు. నేను అతడిని గౌరవిస్తాను. ఇది చాలా కాలం క్రితం విషయం.' అని రాజమౌళి చెప్పాడు.

అయితే ప్రస్తుతం రాజమౌళి గతంలో చేసిన క్లిప్, ఇప్పుడు మాట్లాడిన క్లిప్ కలిపి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ చేశారు. ఆ సమయంలో చెప్పిన విధానంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అయితే కొంతమంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజమౌళి ప్రభాస్(Prabhas) తో రెండు బాహుబలి(Bahubali) చిత్రాలు తీశాడు. బాహుబలి: ది బిగినింగ్ ఇన్, 2015లో, బాహుబలి: ది కన్‌క్లూజన్ 2017...లో విడుదల అయ్యాయి. రెండో పార్ట్ బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. RRR మూడో స్థానంలో ఉంది. యష్ KGF చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాల్గో చిత్రం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం