తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sridevi Chiranjeevi Song : శ్రీదేవి చిరంజీవి సాంగ్ రిలీజ్.. మెగాస్టార్ మార్క్ స్టెప్పులు

Sridevi Chiranjeevi Song : శ్రీదేవి చిరంజీవి సాంగ్ రిలీజ్.. మెగాస్టార్ మార్క్ స్టెప్పులు

HT Telugu Desk HT Telugu

19 December 2022, 17:27 IST

    • Waltair Veerayya Second Song : వాల్తేరు వీరయ్య నుంచి మరో అప్డేట్ వచ్చింది. శ్రీదేవి చిరంజీవి పాటను విడుదల చేశారు. రెండో పాట రిలీజ్ కాస్త ఆలస్యమైంది. దీంతో అభిమానులు ఎందుకీ ఆలస్యం అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
శ్రీదేవి చిరంజీవి పాట విడుదల
శ్రీదేవి చిరంజీవి పాట విడుదల (twitter)

శ్రీదేవి చిరంజీవి పాట విడుదల

Waltair Veerayya Second Single : మెగా అభిమానులు(Mega Fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. వాల్తేర్ వీరయ్య(Waltair Veerayya) నుంచి మరో పాట విడుదలైంది. చిరంజీవి శ్రీదేవిది హిట్ కాంబినేషన్. దీంతో వాల్తేరు వీరయ్యలో వారి పేర్ల మీదే ఓ పాటను పెట్టాడు దేవీశ్రీ ప్రసాద్. శ్రీదేవి చిరంజీవి(Sridevi Chiranjeevi Song) అనే పాటను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

మెగాస్టార్ చిరు(Megastar Chiru), శ్రుతిహసన్ పై మంచు కొండల్లో ఈ పాటను షూట్ చేశారు. శ్రీదేవి చిరంజీవి సాంగ్ మీద.. గతంలో మెగాస్టార్ లీక్ ఇచ్చాడు. ఈ పాట తీసిన లొకేషన్ల గురించి., అక్కడ ఉన్న చలి, మంచులోయ అందాలు, మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత గురించి చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పాట మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. సాంగ్ ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు ఎదురు చూశారు. తాజాగా పాట విడుదలైంది.

అయితే ఈ పాట మెుదట నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో కాస్త ఆలస్యమవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఎదురుచూపులకు తగ్గట్టుగానే పాట ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ట్వీట్ చేసింది. అయినా మెగా అభిమానులు ఊరుకోలేదు. మైత్రీపై మండిపడ్డారు. బాస్ పాట కోసం ఎదురుచూస్తున్న సమయంలో మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటని.. ట్వీట్లు మెుదలుపెట్టారు. ఆ తర్వాత కాసేపటికి శ్రీదేవి చిరంజీవి పాట విడుదలైంది.

వాల్తేరు వీరయ్య ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో ఇప్పటికే చిరు సందడి చేశారు. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. బాస్ పార్టీ(Boss party) పాటకు దేవిశ్రీ ఇచ్చిన మాస్ బిట్స్ మోగుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక తాజాగా విడుదలైన నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవి అంట అనే సాంగ్ ను జస్ప్రిత్, సమీరా భరద్వాజ్ చక్కగా పాడారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్నారు. దర్శకుడు బాబీ సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా రూపొందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం