Skanda Review: స్కంద రివ్యూ - బోయపాటి మార్కు మాస్ భీభత్సం
28 September 2023, 13:33 IST
Skanda Review: రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న (గురువారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
రామ్ స్కంద మూవీ
Skanda Review: కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన రామ్ ఫస్ట్ టైమ్ పూర్తిస్థాయి మాస్ జోనర్‌లో చేసిన సినిమా స్కంద. మాస్ సినిమాలకు టాలీవుడ్‌లోకు ట్రేడ్ మార్క్‌గా పేరుతెచ్చుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.ఇందులో శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 28న) రిలీజైంది. ఈ సినిమాతోనే పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి రామ్ ఎంట్రీ ఇచ్చాడు. స్కంద ఎలా ఉంది? ఈ సినిమాతో బోయపాటి శ్రీను అతడికి మాస్ హిట్ ఇచ్చాడా ? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
సీఏం కూతుళ్లు కిడ్నాప్...
తెలంగాణ సీఏం కుమార్తె (శరత్ లోహితస్య)తో పాటు ఏపీ సీఏం (అజయ్ పుర్కర్) కుమార్తెలను రుద్రకంటి భాస్కర్ (రామ్ పోతినేని) కిడ్నాప్ చేస్తాడు. అసలు అతడు ఎవరు? తెలంగాణ సీఏం కుమార్తెను ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడి ఆమె కుటుంబానికి అతడు చేరువ అవ్వడానికి కారణం ఏమిటి? మిత్రులుగా ఉన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా శత్రువులుగా మారారు? రుద్రరాజపురానికి చెందిన రుద్రకంటి రామకృష్ణరాజు ను ముఖ్యమంత్రులు ఎందుకు జైలుకు పంపించారు? రామకృష్ణరాజుతో భాస్కర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? తండ్రికి ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రలతో భాస్కర్ ఎలా తలపడ్డాడు? ఈ పోరాటంలో భాస్కర్‌కు అతడి రూపంలోనే ఉన్న రాయలసీమ యువకుడు(రామ్ పోతినేని) ఎలా సహాయపడ్డాడు? అన్నదే స్కంద మూవీ కథ.
యాక్షన్, ఎలివేషన్స్...
కథల కంటే యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్‌ను నమ్ముకొనే కెరీర్ ఆరంభం నుంచి డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాలు చేస్తున్నాడు. అతడి సినిమా అంటే తెరనిండా రక్తపాతం, హింస కామన్‌గా కనిపిస్తాయి. స్కంద కూడా అలాంటి రొటీన్ టెంప్లేట్ మూవీనే. సింపుల్ రివేంజ్ డ్రామాతో బోయపాటి శ్రీను స్కంద కథను రాసుకున్నారు. తనదైన శైలి మాస్ హంగులు, హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో లాజిక్స్‌ను పూర్తిగా పక్కనపెట్టి మ్యాజిక్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు.
రివేంజ్ డ్రామా...
తండ్రి స్నేహితుడికి ముఖ్యమంత్రులు చేసిన అన్యాయంపై పగను తీర్చుకునే ఓ యువకుడి కథ ఇది. రెండు ముక్కల్లో ఆయిపోయే కథను రెండు గంటల నలభై నిమిషాల పాటు స్క్రీన్‌పై చెప్పడానికి బోయపాటి స్క్రీన్‌పై భీభత్సం సృష్టించాడు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, పాలిటిక్స్ ఇలా అన్నిఅస్త్రాలు వాడాడు. చివరకు క్లైమాక్స్‌లో డ్యూయల్ రోల్ అంటూ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. మాస్ ఆడియెన్స్‌కు కంప్లీట్ ఫుల్ మీల్స్ అందించేందుకు చాలా కష్టపడ్డాడు.
ఫ్లాష్‌బ్యాక్...
స్నేహితులైన ఏపీ, తెలంగాణ సీఏంల మధ్య శత్రుత్వం ఏర్పడటం...సీఏం కూతురితో హీరో ప్రేమ, రొమాంటిక్ అంశాలతో ఫస్ట్ హాఫ్ యాక్షన్, ఫన్ అంశాలతో సరదాగా సాగిపోతుంది.
ఇరు రాష్ట్రాల సీఏం కూతుళ్లను హీరో కిడ్నాప్ చేసే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సెకండాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్ అంశాలతో నడిపించారు. విదేశాల్లో చదువుకునే హీరో తన కుటుంబం కోసం పల్లెటూరికి రావడం, హీరో కుటుంబానికి ఆప్తుడైన శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రులు అక్రమంగా జైలుకు పంపించడం అంటూ రొటీన్ ఫ్యామిలీ డ్రామాతో సెకండాఫ్ సాగుతుంది. చివరలో డ్యూయల్ రోల్ ట్విస్ట్ ఇచ్చి భారీ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా ఎండ్ అవుతుంది.
పతాక స్థాయిలో...
ఇస్మార్ట్ శంకర్ మినహా కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ , లవర్ బాయ్ టైప్ రోల్స్ చేశాడు రామ్. అతడిలోని మాస్ కోణాన్ని ఈ సినిమాలో పతాక స్థాయిలో బోయపాటి ఆవిష్కరించారు. తెలంగాణ, రాయలసీమ యాసలో అతడు చెప్పిన డైలాగ్స్, క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి.
శ్రీలీల గ్లామర్, డ్యాన్సులతో అట్రాక్ట్ చేసింది. కథకు కీలకంగా నిలిచే పాత్రల్లో శ్రీకాంత్, సయి మంజ్రేకర్ నటన ఆకట్టుకుంటుంది. రామ్ పోతినేని తండ్రి గా రాజా దగ్గుబాటి కనిపించారు. సుదీర్ఘ విరామం తర్వాత స్కంద సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన రాజా దగ్గుబాటి తండ్రి పాత్రలో చక్కటి ఎమోషన్స్ పలికించాడు. ముఖ్యమంత్రులుగా అజయ్ పుర్కార్, శరత్ లోహితస్య నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రల్లో నటించారు. బోయపాటి శ్రీను శైలికి తగ్గట్లుగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సాగింది.
మాస్ లవర్స్‌కు...
బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ అంశాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను స్కంద మెప్పిస్తుంది. నటుడిగా రామ్ కొత్తగా కనిపించాడు. అతడి అభిమానులను ఆకట్టుకుంటుంది.