తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Vs Pedakapu Collections: బాక్సాఫీస్ రిజ‌ల్ట్ - భారీ న‌ష్టాల దిశ‌గా స్కంద‌, పెద‌కాపు - చంద్ర‌ముఖి 2 డిజాస్ట‌ర్‌!

Skanda vs Pedakapu Collections: బాక్సాఫీస్ రిజ‌ల్ట్ - భారీ న‌ష్టాల దిశ‌గా స్కంద‌, పెద‌కాపు - చంద్ర‌ముఖి 2 డిజాస్ట‌ర్‌!

03 October 2023, 12:38 IST

  • Skanda vs Pedakapu Collections: ఈ వారం థియేట‌ర్ల‌లో రిలీజైన‌ స్కంద‌, పెద‌కాపుతో పాటు చంద్ర‌ముఖి 2 సినిమాలు ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిలా ప‌డ్డాయి. డిజాస్ట‌ర్ దిశ‌గా ఈ మూడు సినిమాలు సాగుతోన్నాయి.

చంద్ర‌ముఖి 2
చంద్ర‌ముఖి 2

చంద్ర‌ముఖి 2

Skanda vs Pedakapu Collections: ఈ వారం రిలీజైన స్కంద‌, పెద‌కాపుతో పాటు డ‌బ్బింగ్ మూవీ చంద్ర‌ముఖి 2 కూడా నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు పెద్ద షాకిచ్చాయి. పెద‌కాపు, చంద్ర‌ముఖి 2 డిజాస్ట‌ర్స్‌గా నిల‌వ‌గా స్కంద ఐదు రోజుల్లో కేవ‌లం యాభై శాతం మాత్ర‌మే రిక‌వ‌రీ అయ్యింది. ఈ మూడు సినిమాలు ఎగ్జిబిట‌ర్ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

స్కంద‌ …నాలుగు రోజుల్లో వ‌చ్చింది ఎంతంటే...

స్కంద మూవీ నాలుగు రోజుల్లో 32 కోట్ల‌కుపైగా గ్రాస్‌, 19 కోట్ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టింది. ఆదివారంతో పోలిస్తే సోమ‌వారం దాదాపు కోటి వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ పెర‌గ‌డం ఈ సినిమాకు ఊర‌ట‌నిచ్చే అంశంగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఆదివారం రోజు మూడు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన స్కంద సోమ‌వారం నాడు మాత్రం నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ది.

47 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌లో రిలీజైన ఈ మూవీ నాలుగు రోజుల్లో 19 కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం ఎగ్జిబిట‌ర్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా 28 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాల్సిఉంది. సినిమాపై వ‌చ్చిన నెగెటివ్ కామెంట్స్‌, ట్రోల్స్ చూస్తుంటే స్కంద‌ లాభాల్లోకి అడుగుపెట్ట‌డం దాదాపు అసాధ్య‌మ‌నే అనిపిస్తోంది.

రివేంజ్, మాస్‌, యాక్ష‌న్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ సినిమాను తెర‌కెక్కించాడు. స్కంద‌లో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

పెద‌కాపు బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌....

బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత డైరెక్ట‌ర్‌ శ్రీకాంత్ అడ్దాల కెరీర్‌లో మ‌రో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా పెద‌కాపు నిలిచింది. విరాట్ క‌ర్ణా హీరోగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ రిలీజ్ రోజు నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. మూడు రోజుల్లో ఈ సినిమా కోటిలోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. దాదాపు 12 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నిర్మాత‌ల‌కు దారుణంగా న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే చాలా థియేట‌ర్ల నుంచి ఈ సినిమాను ఎత్తేశారు. కాన్సెప్ట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఎగ్జిక్యూట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల త‌డ‌బ‌డ‌టంతో సినిమా ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది.

చంద్ర‌ముఖి 2 సేమ్ రిజల్ట్…

మోస్తారు అంచ‌నాల‌తో రిలీజైన డ‌బ్బింగ్ మూవీ చంద్ర‌ముఖి 2 కూడా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది. కంగ‌నా ర‌నౌత్‌, లారెన్స్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ నాలుగు రోజుల్లో కేవ‌లం మూడున్న‌ర కోట్లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎనిమిదిన్న‌ర

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం