తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siren Ott Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కీర్తి సురేశ్, జయం రవి మూవీ సైరన్ రిలీజ్ డేట్ ఇదే

Siren OTT release date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కీర్తి సురేశ్, జయం రవి మూవీ సైరన్ రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

27 March 2024, 17:46 IST

    • Siren OTT release date: తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సైరన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మొదట్లో నేరుగా ఓటీటీలోకే వస్తుందనుకున్న ఈ సినిమా.. తర్వాత థియేటర్లలో రిలీజై మంచి టాక్ కొట్టేసింది.
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కీర్తి సురేశ్, జయం రవి మూవీ సైరన్ రిలీజ్ డేట్ ఇదే
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కీర్తి సురేశ్, జయం రవి మూవీ సైరన్ రిలీజ్ డేట్ ఇదే

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కీర్తి సురేశ్, జయం రవి మూవీ సైరన్ రిలీజ్ డేట్ ఇదే

Siren OTT release date: జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సైరన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. గత నెల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతోంది. పెరోల్ పై విడుదలైన ఖైదీ కథగా ఈ సైరన్ మూవీ తెరకెక్కింది. అయితే సౌత్ కు చెందిన ప్రముఖ నటీనటుందరూ ఉండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్రేజ్ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

సైరన్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ నటుడు జయం రవి, టాలీవుడ్ తోపాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతున్న కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్లు నటించిన సైరన్ మూవీ ఏప్రిల్ 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుందని మొదట్లో వార్తలు వచ్చినా.. తర్వాత థియేటర్లలోనూ రిలీజ్ చేశారు.

రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ఆంటోనీ భాగ్య‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓ అంబులెన్స్ డ్రైవర్ ప్రతీకారం చుట్టూ కథ తిరుగుతుంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలలో నటించిన తర్వాత జయం రవి కనిపించిన మూవీ సైరన్. ఆ సినిమాకు పూర్తి భిన్నమైన జానర్ లో వచ్చిన ఈ మూవీలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

సైరన్ మూవీ కథేంటంటే?

రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఆంటోనీ భాగ్య‌రాజ్ సైర‌న్ మూవీని తెర‌కెక్కించాడు. త‌న భార్య మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌పై ఓ సాధార‌ణ అంబులెన్స్ డ్రైవ‌ర్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌న్న‌దే సైరన్ మెయిన్ పాయింట్‌.

ఈ రొటీన్ స్టోరీ చూట్టూ తండ్రీకూతుళ్ల ఎమోష‌న్ తో పాటు పోలీస్‌, కిల్ల‌ర్ ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు పై ఎత్తుల‌తో డ్రామాను అల్లుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎంగేజింగ్‌గా సినిమాను న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్‌.

తిల‌గ‌న్ పాత్ర‌లో జ‌యం ర‌వి క్యారెక్ట‌రైజేష‌న్‌, యాక్టింగ్ కొత్త‌గా ఉన్నాయి. లుక్ ప‌రంగా గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అత‌డి న‌ట‌న బాగుంది. పోలీస్ ఆఫీస‌ర్‌గా కీర్తిసురేష్ రోల్ ఈ సినిమాకు స‌ర్‌ప్రైజింగ్‌గా నిలిచింది. అయితే న‌ట‌న ప‌రంగా ఛాలెజింగ్‌గా నిలిచే క్యారెక్ట‌ర్ మాత్రం కాద‌నిపిస్తుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. అజ‌య్ విల‌నిజం రొటీన్‌గా ఉంది.

హాట్‌స్టార్ లేటెస్ట్ రిలీజెస్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ మధ్యకాలంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజయ్యాయి. తమిళ సినిమా లవర్, మలయాళ సూపర్ హిట్ మూవీస్ అబ్రహం ఓజ్లర్, నేరు.. తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్, మంగళవారం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ లాంటివి హాట్‌స్టార్ లో ఉన్నాయి. ఇప్పుడీ సినిమాలకు సైరన్ కూడా తోడవనుంది. ఏప్రిల్లో సైరన్ తోపాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ హాట్‌స్టార్ లోకి రానున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం