తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan New Year Celebrations: బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి సలార్ బ్యూటీ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

Shruti Haasan New Year Celebrations: బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి సలార్ బ్యూటీ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

Hari Prasad S HT Telugu

01 January 2024, 13:06 IST

    • Shruti Haasan New Year Celebrations: స‌లార్ బ్యూటీ శృతి హాస‌న్ త‌న బాయ్‌ఫ్రెండ్ శాంత‌ను, తండ్రి క‌మ‌ల్ హాస‌న్‌ల‌తో క‌లిసి న్యూఇయ‌ర్ సెల‌బ్రేట్ చేసుకున్న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.
మ‌ణిర‌త్నం, సుహాసిని, క‌మ‌ల్ హాస‌న్‌, బాయ్‌ఫ్రెండ్ శాంత‌నుల‌తో శృతి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌
మ‌ణిర‌త్నం, సుహాసిని, క‌మ‌ల్ హాస‌న్‌, బాయ్‌ఫ్రెండ్ శాంత‌నుల‌తో శృతి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

మ‌ణిర‌త్నం, సుహాసిని, క‌మ‌ల్ హాస‌న్‌, బాయ్‌ఫ్రెండ్ శాంత‌నుల‌తో శృతి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

Shruti Haasan New Year Celebrations: స‌లార్ మూవీ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో న్యూఇయ‌ర్ సెల‌బ్రేట్ చేసుకుంది శృతి హాస‌న్‌. అయితే ఈ సెల‌బ్రేష‌న్స్‌లో ఆమె బాయ్‌ఫ్రెండ్ శాంత‌ను హ‌జారికాతోపాటు తండ్రి క‌మ‌ల్ హాస‌న్ కూడా ఉండ‌టం విశేషం. వీళ్ల‌తోపాటు సుహాసిని, మ‌ణిర‌త్నం కూడా సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మీరా.. ఆదర్శ్ వల్లే ముకుంద తల్లి అవుతుందన్న భవానీ

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఫొటోల‌ను శృతి హాస‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చాలా రోజుల త‌ర్వాత త‌న సొంతూరు చెన్నైలో కొత్త ఏడాది సెల‌బ్రేట్ చేసుకున్నానంటూ ఆమె ఈ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. చాలా మంది సెల‌బ్రిటీలు విదేశాల‌కు వెళ్లి సెల‌బ్రేట్ చేసుకుంటే.. శృతి మాత్రం ఫ్యామిలీతో గ‌డిపింది.

ఈ ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్స్‌లో శృతి బాయ్‌ఫ్రెండ్ శాంత‌ను స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. శృతి బ్లాక్‌డ్రెస్‌లో మెరిసింది. క‌మ‌ల్ హాస‌న్ కూడా బ్లాక్ ష‌ర్ట్ వేసుకోగా.. శాంత‌ను చాలా సింపుల్ డ్రెస్‌లో క‌నిపించాడు. అంద‌రికీ హ్యాపీ న్యూఇయ‌ర్ చెబుతూ.. శృతి త‌న ఫొటోల‌ను షేర్ చేసింది.

ఈ సెల‌బ్రేష‌న్స్‌లో తాను శాంత‌నుతో క‌లిసి స‌ర‌దాగా ఆడిపాడుతున్న ఫొటోలు, వీడియోల‌ను కూడా శృతి పంచుకుంది. స‌లార్ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌స్తుతం ఆమె అడివి శేష్‌తో క‌లిసి పాన్ ఇండియా మూవీలో న‌టిస్తోంది. గ‌తేడాది మొద‌ట్లో వాల్తేర్ వీర‌య్య‌, వీర సింహారెడ్డిల‌తో స‌క్సెస్ అందుకున్న శృతి.. స‌లార్‌తో 2023ను గ్రాండ్‌గా ముగించింది.

స‌లార్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే రూ.500 కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన విష‌యం తెలిసిందే. వ‌రుస తెలుగు సినిమాల్లో క‌నిపించిన ఆమె.. 2024లో ఇక హిందీ సినిమాల‌పై దృష్టి సారించ‌నుంది.

శృతి త‌న బాయ్‌ఫ్రెండ్ శాంత‌నును సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంద‌ని ఈ మ‌ధ్యే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బీటౌన్‌లో సెల‌బ్రిటీగా మారిపోయిన ఒర్రీ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారి ఆమె పెళ్లి వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేద‌ని, అంద‌రికీ చెప్పే పెళ్లి చేసుకుంటాన‌ని శృతి క్లారిటీ ఇచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం