Inimel: కమల్ హాసన్ నిర్మాణం.. శ్రుతి హాసన్ సంగీతం.. హీరోగా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్
15 March 2024, 10:32 IST
Kamal Haasan Lokesh Kanagaraj Inimel: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న మ్యూజిక్ వీడియో ఇనిమెల్. ఈ మ్యూజిక్ వీడియోలో నటుడిగా పరిచయం కానున్నాడు విక్రమ్ మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.
కమల్ హాసన్ నిర్మాణం.. శ్రుతి హాసన్ సంగీతం.. హీరోగా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్
Kamal Haasan Shruti Haasan Inimel: ఉలగనాయగన్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా తన నటనతో అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పాపులర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను త్వరలో హీరోగా పరిచయం చేయనున్నాడు కమల్ హాసన్. అయితే అది సినిమా కాదు. ఒక మ్యూజిక్ విడియో.
ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మ్యూజిక్ వీడియో ఇనిమెల్ (Inimel Music Video). దీన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకను కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సంగీతం అందిస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్న లోకేష్ కనగరాజ్ ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోతో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకలా చెప్పాలంటే ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్ కనగరాజ్ హీరో.
ఇనిమెల్ మ్యూజిక్ వీడియోను ఆర్‌కేఎఫ్ఐ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ మ్యూజిక్ వీడియోను టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ స్వరపరచడమే కాకుండా కాన్సెప్ట్ సైతం అందించారు. ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్‌తో పాటు శ్రుతి హాసన్ కూడా కనిపించనుంది. అంతేకాకుండా ఇనిమెల్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్. ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది.
ఓవైపు ఉలగనాయగన్ కమల్ హాసన్, మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఇంకోవైపు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రుతి హాసన్ వంటి ముగ్గురు స్టార్స్ ఉండేసరికి ఇనిమెల్ మ్యూజిక్ వీడియోపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ వీడియో ఎప్పుడెప్పుడూ వస్తుందా అని అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ మ్యూజక్ వీడియో విడుదల తేదిని ప్రకటించనున్నారని సమాచారం. కాగా ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇనిమెల్ మ్యూజిక్ వీడయోకు భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా చేశారు. అలాగే శ్రీరామ్ అయ్యంగార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమ్ ఎంతటి సెన్సేషన్ హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ మూవీతో కమల్ నాలుగేళ్ల తర్వాత సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ ఇచ్చాడు. సినిమాలో కమల్ యాక్టింగ్, ఫైటింగ్ సీన్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది.
అలాగే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్‌కు ప్రశంసలు అందుకున్నాడు. విక్రమ్ మూవీలో కమల్ హాసన్‌తోపాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి పాపులర్ యాక్టర్స్‌తోపాటు సూర్య గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు. సినిమాలోని అన్ని పాత్రల కంటే సూర్య రోలెక్స్ విలన్ రోల్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే, విక్రమ్ అంత హిట్ అవ్వడానికి మరో కారణం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.
విక్రమ్ సినిమాలోని ఒక్కో పాత్రకు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ అదిరిపోయింది. ముఖ్యంగా రోలెక్స్ రోల్ ఎంట్రీ సమయంలో వచ్చే బీజీఎమ్ ఎంతో మందికి ఫేవరెట్‌గా నిలిచింది. ఇక లోకేష్ కనగరాజ్ ఇటీవలే దళపతి విజయ్‌తో లియో మూవీ తెరకెక్కించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు ఇనిమెల్ మ్యూజిక్ వీడియో నటుడిగా కనిపించనున్నాడు లోకేష్ కనగరాజ్.
టాపిక్