తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Breaks Bahubali-2 Record: బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన పఠాన్.. కాసుల వర్షం కురిపించిన షారుఖ్ మూవీ

Pathaan Breaks Bahubali-2 record: బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన పఠాన్.. కాసుల వర్షం కురిపించిన షారుఖ్ మూవీ

04 March 2023, 16:16 IST

    • Pathaan Breaks Bahubali-2 record: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా బాహుబలి 2 రికార్డును అధిగమించింది.
బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన పఠాన్
బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన పఠాన్

బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన పఠాన్

Pathaan Breaks Bahubali-2 record: నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా విడుదలై కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విడుదలైన తొలి రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపింది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అదిరిపోయే వసూళ్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త మైలురాయిని సాధించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా రూ.529.7 కోట్ల కలెక్షన్లు సాధించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1027 కోట్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తాజాగా ఈ సినిమా బాహుబలి 2 రికార్డును అధిగమించింది. బాహుబలి ది కన్‌క్లూజన్ హిందీ వెర్షన్ రూ.511 కోట్ల కొల్లగొట్టగా.. పఠాన్ రూ.529 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది. టికెట్ల అమ్మకాలను మరింత పెంచడానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ధరలను రూ.110లకు తగ్గించింది. అంతేకాకుండా వన్ గెట్ వన్ ఫ్రీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడంతో వసూళ్ల బాగా వచ్చాయి.

ఇటీవల విడుదలైన సినిమాలు సెల్ఫీ, షెహజాదా కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పఠాన్ సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ కూడా వారాంతంలో కేవలం రూ.13.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కార్తిక్ ఆర్యన్ నటించిన షెహజాదా కూడా రెండు వారాల్లో రూ.30 కోట్లకే పరిమితమైంది. కానీ పఠాన్ విడుదలై 38 రోజులు గడుస్తున్నా ఇంకా కోటి వరకు వసూలు చేస్తుందని అంచనా వేయడమైంది. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన తూ ఝూథీ మే మక్కర్ విడుదలతోనైనా పఠాన్ వసూళ్లపై ప్రభావితం కావచ్చు. అప్పటి వరకు మాత్రం పఠాన్ తిరుగులేని విధంగా రికార్డులను కొల్లగొడుతోంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం