Nayanthara Remuneration: నయనతారకు 11 కోట్లు - దీపికాకు 20 కోట్లు - హీరోయిన్ కంటే గెస్ట్ రోల్‌కు రెమ్యునరేషన్ ఎక్కువ!
01 August 2023, 6:25 IST
Nayanthara Remuneration: షారుఖ్‌ఖాన్ జవాన్ సినిమా సెప్టెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికా పడుకోణ్ ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
నయనతార
Nayanthara Remuneration: పఠాన్ సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్(Shah rukh Khan). ఈ బ్టాక్బస్టర్ తర్వాత షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం జవాన్ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో నయనతార(Nayanthara) హీరోయిన్గా నటిస్తోండగా దీపికా పడుకోణ్ (Deepika Padukone) గెస్ట్ రోల్ చేస్తోంది. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్‌గా నటిస్తోన్నాడు.
దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో షారుఖ్‌ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా నాలుగు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. కాగా ఈ సినిమా రెమ్యునరేషన్స్ హిందీ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికా పడుకోణ్ ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకుగాను నయనతార 11 కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించగా, దీపికా పడుకోణ్‌కు 17 నుంచి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిసింది.
విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి 21 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ స్వీకరించిన విలన్‌గా జవాన్ సినిమాతో విజయ్ సేతుపతి రికార్డ్ క్రియేట్ చేశాడు.
జవాన్ సినిమాతోనే దర్శకుడిగా అట్లీ, హీరోయిన్గా నయనతార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఆగస్ట్‌లో జవాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. బాలీవుడ్‌తో పాటుదక్షిణాది భాషల్లో ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది.