తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Save The Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ: మ్యాజిక్ రిపీట్ అయిందా?

Save The Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ: మ్యాజిక్ రిపీట్ అయిందా?

15 March 2024, 12:26 IST

    • Save the Tigers Season 2 Web Series Review: సేవ్ ది టైగర్స్ 2 వెబ్ సిరీస్ నేడు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామా సీక్వెల్ వెబ్ సిరీస్ మ్యాజిక్ రిపీట్ చేసిందా.. ఆకట్టుకునేలా ఉందా అనే విషయాలు ఈ రివ్యూలో తెలుసుకోండి.
Save the Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ: మ్యాజిక్ రిపీట్ అయిందా?
Save the Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ: మ్యాజిక్ రిపీట్ అయిందా?

Save the Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ: మ్యాజిక్ రిపీట్ అయిందా?

  • వెబ్ సిరీస్: సేవ్ ది టైగర్స్ సీజన్ 2
  • స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‍స్టార్ (7 ఎపిసోడ్లు), మార్చి 15, 2024
  • ప్రధాన నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగి రెడ్డి, దేవయాని శర్మ, సీరత్ కపూర్, సత్యకృష్ణ, దర్శన్ బానిక్, వేణు ఎల్దండి, రోహిణి తదితరులు
  • ఎడిటర్: శ్రవణ్ కటికనేని, సంగీతం: అజయ్ అరసద
  • రచన: ప్రదీప్ అద్వైత్, విజయ్ నమొజు, ఆనంద్ కార్తీక్, డీవోపీ: ఎస్‍.వి.విశ్వేశ్వర్,
  • క్రియేటర్స్: మహీ వీ రాఘవ్, ప్రదీప్ అద్వైత్
  • నిర్మాతలు: మహీ వీ రాఘవ్, చిన్నా వాసుదేవ రెడ్డి
  • దర్శకుడు: అరుణ్ కొత్తపల్లి

గతేడాది వచ్చిన సేవ్ ది టైగర్స్ కామెడీ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. భార్యలపై ఫ్రస్టేషన్‍ చూపే భర్తల అంశంతో ఆ సిరీస్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‍గా ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు (మార్చి 15) స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి, ఈ సీక్వెల్ అంచనాలను అందుకొని ఆకట్టుకుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

కథ ఇదే

తొలి సీజన్ ముగిసిన దగ్గరే సేవ్ ది టైగర్స్ రెండో సీజన్ షురూ అవుతుంది. పాపులర్ హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్)ను కిడ్నాప్ చేశారంటూ డెయిరీ యజమాని గంటా రవి (ప్రియదర్శి), రైటర్ రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (చైతన్య కృష్ణ)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. హంస ఎక్కుడుందో చెప్పాలని ఆ ముగ్గురిని కొడతారు సీఐ భిక్షపతి (శ్రీకాంత్ అయ్యంగార్). మీడియాలో ఈ వార్త హల్‍చల్ అవుతుంది. హంసను ఆ ముగ్గురూ చంపేశారని ఓ ఛానెల్ రూమర్స్ చెబుతుంది. దీంతో రవి భార్య హైమావతి (జోర్దార్ సుజాత), రాహుల్ భార్య మాధురి (పావని గంగిరెడ్డి), విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) పోలీస్ స్టేషన్ వద్ద గొడవ చేస్తారు.

అయితే, హంసలేఖ సేఫ్‍గా ఉండటంతో రవి, రాహుల్, విక్రమ్‍ను పోలీసులు వదిలేస్తారు. తమ భర్తలు తమతో సరిగా ఉండడం లేదని హైమావతి, రేఖ, మాధురి.. సైకాలజిస్ట్ అయిన స్పందన (సత్యకృష్ణ) దగ్గరికి వెళతారు. ఆమె వారిలో అనుమానాలను రేపుతుంది. ఆ తర్వాత ఆ ముగ్గురి ఫ్యామిలీల్లో ఏం జరిగింది? గొడవలు ఎందుకు వస్తాయి? గంటా రవిని ఎమ్మెల్యే ఎలా మోసం చేశాడు? గేటెట్ కమ్యూనిటీలోకి వెళ్లాలనుకునే హైమా ఆశ నెరవేరిందా? హీరోయిన్ హంసలేఖ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? హారిక (దర్శన బానిక్) వల్ల విక్రమ్ ఫ్యామిలీలో ఏం జరిగింది? రాహుల్ సినీ రచయిత అయ్యాడా? అనేవి సేవ్ ది టైగర్స్ సీజన్ 2లో ఉంటాయి.

కథనం ఇలా..

హీరోయిన్ హంసలేఖ ఎక్కడంటూ గంటా రవి, రాహుల్, విక్రమ్‍ను పోలీసులు ఇంటెరాగేట్ చేయడంతో ఈ సీజన్ సరదాగానే మొదలవుతుంది. ఈ ముగ్గురు హంసలేఖను చంపేశారని ఈ క్రమంలోనే ఓ టీవీ ఛానెల్ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. సెన్సేషన్ కోసం ఆ ఫేక్ వార్తను విపరీతంగా ప్రసారం చేస్తుంది. దీంతో అందరూ కంగారు పడతారు. ప్రస్తుత పరిస్థితులకు దీన్ని సెటైరికల్‍గా మేకర్స్ చూపించారు. తమ భర్తలను విడిచేయాలని ఆ ముగ్గురి భార్యలు స్టేషన్ వద్ద గొడవ చేస్తారు. మొత్తంగా వీటి చుట్టూ మంచి ఫన్ జనరేట్ చేశారు క్రియేటర్స్ మహీ వి రాఘవ్, అద్వైత్, దర్శకుడు అరుణ్.

హైమా, రేఖ, మాధురి సైకాలజిస్ట్ స్పందన దగ్గరికి వెళ్లి వారి భర్తలు తమతో సరిగా ఉండడం లేదని, మళ్లీ ఉద్యోగం చేసేలా చేసేందుకు ఏం చేయాలని అడుగుతారు. దీనికి స్పందన సెవెన్ ఇయర్స్ ఇట్చింగ్ అనే థియరీ చెబుతుంది. అయితే, ఇది అంత ఇంట్రెస్టింగ్‍గా అనిపించదు. దీని చుట్టూ మరింత సరదా సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కాసేపు కథనం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత హైమ, రేఖ, మాధురి పార్టీ చేసుకునే సీన్లు నవ్విస్తాయి. ముఖ్యంగా హైమా ఈ పోర్షన్‍‍లో మెయిన్‍గా ఉంటుంది. కార్పొటర్ సీటు ఇస్తానని చెప్పగానే ఎమ్మెల్యేను రవి గుడ్డిగా నమ్మేయడం, భారీగా డబ్బులు ఇవ్వడం అంత కన్విన్సింగ్‍గా అనిపించదు.

రాతియుగమైన క్రీస్తు పూర్వం 10000 సంవత్సరం అంటూ ఓ ఎపిసోడ్‍లో హడావుడి ఉంది. పెళ్లి అనే కాన్సెప్ట్ ఎలా పుట్టింది, మహిళల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు పురుషుడు ఈ పద్ధతిని తీసుకొచ్చాడని ఏదో చూపించారు. అయితే, ఇది ఏమంత సక్సెస్ కాలేదు. ఆ ట్రాక్ ఏమంత నవ్వించేదు. కథ లేక ఏదో డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పొరుగింటి పెంపుడు కుక్క వల్ల రాహుల్ ఇబ్బందులు పడడం, తాను ఓ బర్రెపిల్లను తెచ్చుకోవడం ఫన్‍గా అనిపిస్తుంది. గంటా రవి కుమార్తె ఫంక్షన్ ఎపిసోడ్ కూడా సరదాగా సాగుతుంది. మరోవైపు, హీరోయిన్ హంసలేఖ.. వృషణ్ బాబు (కిరీటి)తో విడిపోవడంతో సినీ కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే, హీరోయిన్ అంటే కొందరిలో ఎలాంటి భావన ఉంటుంది, రూమర్లను ఎంత సులువుగా నమ్ముతారనే దాన్ని మేకర్స్ చూపించారు. చివరి ఎపిసోడ్ ఎమోషనల్‍గా సాగుతుంది. ముగ్గురు టైగర్లకు ఇబ్బందులు తలెత్తుతాయి.

కాస్త తగ్గిన ఫన్

మొదటి సీజన్‍తో పోలిస్తే.. ఈ సేవ్ ది టైగర్స్ రెండో సీజన్‍లో కామెడీ డోస్ తగ్గింది. డ్రామా బాగానే ఉన్నా ఫన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. అక్కడక్కడా కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే, మరీ బోర్ కొట్టినట్టు కూడా అనిపించదు.

ఎమోషనల్‍ ఎండ్.. మూడో సీజన్‍ కూడా!

ఈ సీజన్‍లో ఎమోషనల్ సీన్లు బాగానే పండాయి. ముఖ్యంగా గంటా రవి, అతడి కూతురు మధ్య వచ్చే సీన్లు మెప్పిస్తాయి. ఫంక్షన్ తర్వాత కూతురితో గంటా రవి మాట్లాడడం చాలా మందికి రిలేట్ అవుతుంది. రవి గురించి స్కూల్‍లో కుమార్తె మాట్లాడడం కూడా మెప్పిస్తుంది. అయితే, చివర్లో రవి, హైమా మధ్య గొడవ జరుగుతుంది. విక్రమ్, రేఖ మధ్య కూడా హారిక వల్ల విభేదాలు వస్తాయి. ఇది కూడా కాస్త ఎమోషనల్‍గానే ఉంటుంది. హంసలేఖ కోసం రాహుల్ చేసే పని కూడా బాగుంటుంది. మొత్తంగా రెండో సీజన్‍ను కూడా అసంపూర్తిగానే ఎండ్ చేసి.. మూడో సీజన్ ఉందని హింట్ ఇచ్చారు మేకర్స్.

దర్శకుడు అరుణ్ కొత్తపల్లి, క్రియేటర్స్ మహీ వి రాఘవ్, అద్వైత్ ఈ రెండో సీజన్‍లో డ్రామా, ఎమోషన్‍పై కూడా దృష్టి పెట్టారు. దీంతో ఫస్ట్ సీజన్ రేంజ్‍లో అంత కామెడీగా ఈ రెండో సీజన్ అనిపించదు. భార్యలపై ముగ్గురి ఫ్రస్టేషన్ చుట్టూ మరిన్ని సరదా సన్నివేశాలు రాసుకొని ఉండే బాగుండేది. అయితే, ఎక్కువ భాగాలను ఎంగేజింగ్‍గా రూపొందించడంలో సఫలీకృతులయ్యారు. అజయ్ అందించిన సంగీతం సిరీస్‍కు తగ్గట్టే సాగింది.

ఎవరెలా చేశారంటే..

ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం - పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ - దేవయాని శర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నటనతో మెప్పించారు. ముఖ్యంగా ప్రియదర్శి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జోర్దార్ సుజాత తనకు సూటయ్యే గడసరి పాత్రలో ఆకట్టుకున్నారు. హీరోయిన్ హంసలేఖ పాత్రలో సీరత్ కపూర్ కూడా బాగా చేశారు. బాధను భరిస్తున్న స్టార్‌గా ఎమోషనల్ గానూ కనిపించారు. రోహిణి, దర్శన్ బానిక్, వేణు ఎల్దండి సహా మిగిలిన నటీనటులు వారి పాత్రలో పరిధిలో మెప్పించారు.

చివరగా.. ఓవరాల్‍గా చూస్తే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ఎక్కువ శాతం మెప్పిస్తుంది. తొలి సీజన్‍తో పోలిస్తే కామెడీ తగ్గినా.. డ్రామా బాగానే ఉంటుంది. అయితే, కొన్ని చోట్ల బాగానే నవ్విస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. చాలామందికి రిలేట్ అవుతుంది. కొన్ని చోట్ల ఎమోషనల్‌‍గా ఉంటుంది. భార్యభర్తలు తమ బంధం గురించి ఆలోచించుకునేలా చేస్తుంది. మొత్తంగా ఈ వీకెండ్‍లో ఫ్యామిలీతో కలిసి చూసేందుకు సేవ్ ది టైగర్స్ 2 సీజన్‍ మంచి ఆప్షన్‍గా ఉంటుంది.

రేటింగ్: 2.75/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం