తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyabhama Teaser: యాక్షన్ మోడ్‍లో కాజల్.. ఇంట్రెస్టింగ్‍గా సత్యభామ టీజర్: చూసేయండి

Satyabhama Teaser: యాక్షన్ మోడ్‍లో కాజల్.. ఇంట్రెస్టింగ్‍గా సత్యభామ టీజర్: చూసేయండి

10 November 2023, 14:11 IST

    • Satyabhama Teaser - Kajal Aggarwal: సత్యభామ సినిమా టీజర్ వచ్చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
Satyabhama Teaser: యాక్షన్ మోడ్‍లో కాజల్.. ఇంట్రెస్టింగ్‍గా సత్యభామ టీజర్: చూసేయండి
Satyabhama Teaser: యాక్షన్ మోడ్‍లో కాజల్.. ఇంట్రెస్టింగ్‍గా సత్యభామ టీజర్: చూసేయండి

Satyabhama Teaser: యాక్షన్ మోడ్‍లో కాజల్.. ఇంట్రెస్టింగ్‍గా సత్యభామ టీజర్: చూసేయండి

Satyabhama Teaser - Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ప్రస్తుతం ‘సత్యభామ’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గ్లింప్స్‌తోనే సత్యభామ మూవీపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా కాజల్ అగర్వాల్.. యాక్షన్ మోడ్‍లో సీరియస్ క్యారెక్టర్ చేస్తుండడం ప్రత్యేకంగా ఉంది. కాగా, నేడు (నవంబర్ 10) సత్యభామ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందంటే..

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

తాను గతంలో దర్యాప్తు చేసిన ఓ కేసును వదిలిపెట్టనని కాజల్ అగర్వాల్ చెప్పడంతో సత్యభామ టీజర్ మొదలైంది. “సత్య ఈ కేసు నీ చేతుల్లో లేదు” అని పైఅధికారి అయిన ప్రకాశ్ రాజ్ అంటే.. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది” అని సత్యభామ (కాజల్ అగర్వాల్) అంటారు. కేసు మిస్టరీని ఛేదించటంలో భాగంగా మిస్ అయిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు సిద్ధమవుతారు సత్యభామ.

కాజల్ ఫైట్ సీన్ కూడా టీజర్లో ఉంది. ఇన్వెస్టిగేషన్, యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటెన్స్‌గా సత్యభామ టీజర్ సాగింది. “ఈ కేసు ఇక మీరు వదిలేసినట్టేనా” అనే ప్రశ్నకు నెవర్ అని సమాధానం ఇస్తారు సత్యభామ. ‘ఐ డేర్ యూ’ అని ఒకరి చేతి మీద కత్తితో రాసిన షాట్‍తో సత్యభామ టీజర్ ముగిసింది. దీపావళి సందర్భంగా ముందుగానే ఈ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టపాసులు పేలుతున్న షాట్ కూడా ఈ టీజర్లో ఉంది. సత్యభామ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్టు కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది.

సత్యభామ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుమన్ చిక్కల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్లో బాగా ఇంటెన్స్‌గా సాగింది. ఉత్కంఠను రేపేలా ఉంది. సత్యభామ సినిమాలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మేజర్, గూఢచారి చిత్రాలకు దర్శకుడిగా చేసిన శశికిరణ్ తిక్కా ఈ సత్యభామ సినిమాకు స్క్రీన్‍ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీనివాస రావు తక్కలపల్లి, బాబీ తిక్క నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సత్యభామ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫర్ కాగా.. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా ఉన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం