తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Collection: ఊపందుకున్న సరిపోదా శనివారం కలెక్షన్స్- 58 శాతం రికవరీ- తొలి రోజుకు మించి!

Saripodhaa Sanivaaram Collection: ఊపందుకున్న సరిపోదా శనివారం కలెక్షన్స్- 58 శాతం రికవరీ- తొలి రోజుకు మించి!

Sanjiv Kumar HT Telugu

01 September 2024, 13:30 IST

google News
  • Saripodhaa Sanivaaram 3 Days Worldwide Collection: హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమాకు మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగానే పెరిగాయి. రెండో రోజు పడిపోయిన ఈ కలెక్షన్స్ మూడో రోజున ఓపెనింగ్ డే సాధించిన వసూళ్లు రాబట్టింది. సరిపోదా శనివారం 3 రోజుల కలెక్షన్స్ చూస్తే..

ఊపందుకున్న సరిపోదా శనివారం కలెక్షన్స్- 58 శాతం రికవరీ- తొలి రోజుకు మించి!
ఊపందుకున్న సరిపోదా శనివారం కలెక్షన్స్- 58 శాతం రికవరీ- తొలి రోజుకు మించి!

ఊపందుకున్న సరిపోదా శనివారం కలెక్షన్స్- 58 శాతం రికవరీ- తొలి రోజుకు మించి!

Saripodhaa Sanivaaram Box Office Collection: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సినిమా 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సరిపోదా శనివారం సినిమా విడుదలైన మూడో రోజు మళ్లీ వసూళ్లు పెరిగాయి.

గురువారం (ఆగస్ట్ 29) థియేటర్లలో విడుదలైన నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివావారం చిత్రం ఇండియాలో మూడో రోజున రూ. 9.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. వాటిలో తెలుగు నుంచి రూ. 8.75 కోట్లు, తమిళంలో రూ.24 లక్షలు, మలయాళంలో తొలిరోజు వచ్చినట్లే రూ. లక్ష కలెక్ట్ చేసింది.

56.41 శాతం పెరిగిన కలెక్షన్స్

అయితే, సరిపోదా శనివారం రెండో రోజున రూ. 5.85 కోట్లు (తెలుగు: రూ.5.47 కోట్లు, తమిళం: రూ.30 లక్షలు, మళయాళం: రూ.లక్ష, హిందీ: రూ.7 లక్షలు) కలెక్ట్ చేసింది. అంటే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజున సరిపోదా శనివారం కలెక్షన్స్ పెరిగాయి. అది కూడా 56.41 శాతం వసూళ్లు పెరిగాయి.

అలాగే తొలి రోజున రూ. 9 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మూడో రోజు ఓపెనింగ్స్ కంటే ఎక్కువగా వసూళ్లు సాధించుకుంది నాని మూవీ. ఇలా మొత్తంగా మూడు రోజుల్లో ఇండియాలో ఈ సినిమాకు రూ. 24 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 22.76 కోట్లు, తమిళం రూ. 1.04 కోట్లు, మలయాళం 3 లక్షలు, హిందీ 17 లక్షలుగా ఉన్నాయి.

58 శాతం రికవరీ

అలాగే ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి మూడు రోజుల్లో రూ. 15 కోట్ల కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇక ఇండియాలో రూ. 28.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో సరిపోదా శనివారం సినిమాకు రూ. 45.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, 58 శాతం కలెక్షన్స్ రికవరీ అయినట్లు సమాచారం.

ఇక రూ. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సరిపోదా శనివారం సినిమాకు ఇప్పటికీ వరల్డ్ వైడ్‌గా రూ. 24.70 కోట్ల షేర్ కలెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ. 17.30 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. అలా అయితేనే హిట్ అయి లాభాలు అందుకునేందుకు అవకాశం ఉంది.

మరికొన్ని రోజుల్లోనే

అయితే, కలెక్షన్స్ మరికొన్ని రోజుల్లోనే సరిపోదా శనివారం అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, అభిరామి, అదితి బాలన్, పి.సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం