తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Saregamapa: సరిగమప ఛాంపియన్‌షిప్ కొత్త సీజ‌న్ వ‌చ్చేస్తోంది - విన్న‌ర్స్‌ మ‌ధ్య పోటీ

Zee Telugu Saregamapa: సరిగమప ఛాంపియన్‌షిప్ కొత్త సీజ‌న్ వ‌చ్చేస్తోంది - విన్న‌ర్స్‌ మ‌ధ్య పోటీ

27 January 2023, 21:39 IST

google News
  • Zee Telugu Saregamapa: స‌రిగ‌మ‌ప సింగింగ్ ఛాంపియ‌న్‌షిప్ కొత్త సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యేది ఎప్పుడో వెల్ల‌డైంది. గ‌త సీజ‌న్స్‌లోని విన్న‌ర్స్ ఈ సారి టైటిల్ కోసం పోటీప‌డ‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

స‌రిగ‌మ‌ప  ఛాంపియ‌న్‌షిప్
స‌రిగ‌మ‌ప ఛాంపియ‌న్‌షిప్

స‌రిగ‌మ‌ప ఛాంపియ‌న్‌షిప్

Zee Telugu Saregamapa: స‌రిగ‌మ‌ప సింగింగ్ రియాలిటీ షో కొత్త సీజ‌న్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ షో ప్రారంభ తేదీని అనౌన్స్ చేశారు. జ‌న‌వ‌రి 29న స‌రిగ‌మ‌ప ఛాంపియ‌న్‌షిప్ మొద‌లుకానున్న‌ట్లు జీతెలుగు ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. ప్ర‌తిసారి ఈ షోలో టైటిల్ కోసం కొత్త కంటెస్టెంట్స్ పోటీప‌డేవారు.

కానీ ఆ ఆన‌వాయితీకి భిన్నంగా గ‌త సీజ‌న్‌ల‌లో విజేత‌లుగా నిలిచిన కంటెస్టెంట్స్ ఈ సారి టైటిల్ కోసం పోటీప‌డ‌బోతుండ‌టం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న‌ది. విన్న‌ర్స్‌తో పాటు బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్స్‌ నుంచి ఆరుగురు చొప్పున నాలుగు టీమ్‌లుగా విభ‌జించారు. వారి మ‌ధ్య స‌రిగ‌మ‌ప ఛాంపియ‌న్‌షిప్ 2023 జ‌రుగ‌నుంది.

ఈ సీజ‌న్‌లో ప్ర‌తి టీమ్‌కు ఓ మెంట‌ర్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌తి కంటెస్టెంట్ సోలో, డ్యూయెట్ తో పాటు గ్రూప్ ఫార్మెట్‌ల‌లో పోటీప‌డాల్సి ఉంటుంద‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు. ఈ స‌రిగ‌మ‌ప ఛాంపియ‌న్‌షిప్‌కు జ‌డ్జిలుగా సీనియ‌ర్ గాయ‌కులు మ‌నో, ఎస్‌పి శైల‌జ తో పాటు గేయ‌ర‌చ‌యిత అనంత్ శ్రీరామ్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

మెంట‌ర్స్‌గా సింగ‌ర్స్ శ్రీకృష్ణ‌, సాకేత్‌, పృథ్వీచంద్ర‌, ర‌మ్య బెహ‌రా ఉండ‌నున్నారు. ఈ సింగింగ్ రియాలిటీ షోకు ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా క‌నిపించ‌బోతున్నారు. స‌రిగ‌మ‌ప ఛాంపియ‌న్‌షిప్ ప్ర‌తి ఆదివారం జీతెలుగు ఛాన‌ల్‌లో ప్ర‌సారం కానుంది.

తెలుగు రాష్ట్రాల్లోని సింగ‌ర్స్ లో దాగివున్న‌ ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి స‌రిగ‌మ‌ప ప్ర‌త్యేక‌మైన ఎడిష‌న్‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నామ‌ని జీతెలుగు ఛాన‌ల్ చీఫ్ కంటెంట్ ఆఫీస‌ర్ అనురాధ తెలిపారు.

గ‌త సీజ‌న్స్‌ ఛాంపియ‌న్స్ మ‌ధ్య పోటీ చ‌క్క‌టి వినోదాన్ని అందిస్తుంద‌ని ఆమె తెలిపింది. ఈ ఐకానిక్ షోకు మ‌రోసారి హోస్ట్‌గా ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం ఆనందంగా ఉంద‌ని ప్ర‌దీప్ మాచిరాజు తెలిపాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం