తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sanjay Dutt Role In Prabhas Movie: ప్ర‌భాస్ - మారుతి సినిమాలో సంజ‌య్ ద‌త్ - రోల్ ఇదే

Sanjay Dutt Role in Prabhas Movie: ప్ర‌భాస్ - మారుతి సినిమాలో సంజ‌య్ ద‌త్ - రోల్ ఇదే

19 December 2022, 13:34 IST

  • Sanjay Dutt Role in Prabhas Movie: ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో బాలీవుడ్ అగ్ర న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అత‌డి క్యారెక్ట‌ర్ ఏదంటే...

ప్ర‌భాస్‌, సంజ‌య్‌ద‌త్‌
ప్ర‌భాస్‌, సంజ‌య్‌ద‌త్‌

ప్ర‌భాస్‌, సంజ‌య్‌ద‌త్‌

Sanjay Dutt Role in Prabhas Movie: ప్ర‌భాస్ , ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమాలో బాలీవుడ్ అగ్ర న‌టుడుసంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్‌ జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ముఖ్య పాత్ర‌ను పోషించ‌నున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ తాత‌గా సంజ‌య్‌ద‌త్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. తాతామ‌న‌వ‌ళ్ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే క‌థ ఇద‌ని తెలిసింది. తాత క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఉండ‌టంతోనే సంజ‌య్‌ద‌త్‌ను ఎంపిక‌చేసిన‌ట్లు చెబుతున్నారు.

తాత‌గా సంజ‌య్ ద‌త్ క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో సంజ‌య్ ద‌త్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రిలో సంజయ్ దత్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌భాస్ గ్రాండ్ మ‌ద‌ర్ పాత్ర‌లో జ‌రీనా వ‌హాబ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ ఏడాది య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందిన కేజీఎఫ్ -2 సినిమాలో సంజ‌య్‌ద‌త్ విల‌న్‌గా క‌నిపించాడు.

కేజీఎఫ్ -2 త‌ర్వాత తెలుగులో ప్ర‌భాస్ సినిమాను అంగీక‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాతోనే సంజ‌య్‌ద‌త్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. గ‌తంలో నాగార్జున చంద్ర‌లేఖ సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం