తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza : రిటైర్మెంట్ తీసుకున్నా.. మళ్లీ ఆడనున్న సానియా మీర్జా

Sania Mirza : రిటైర్మెంట్ తీసుకున్నా.. మళ్లీ ఆడనున్న సానియా మీర్జా

Anand Sai HT Telugu

03 July 2023, 5:41 IST

google News
    • Sania Mirza-Wimbledon : రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సానియా మీర్జా మళ్లీ కోర్టులోకి దిగనుంది. వింబుల్డన్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వివరాలను ఆమె తండ్రి ప్రకటించాడు.
సానియా మీర్జా
సానియా మీర్జా

సానియా మీర్జా

Sania Mirza-Wimbledon : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు సానియా మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి సిద్ధమైంది. కాగా, ప్రధాన వింబుల్డన్ డ్రాలో సానియా మీర్జా పోటీ చేయడం లేదు. లేడీస్ లెజెండ్స్ ఇన్విటేషన్ డబుల్స్‌లో సానియా పోటీపడనుంది.

గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోహన్నా కొంటా(Sania Mirza-Johanna Konta)తో సానియా భాగస్వామి కానుంది. 32 ఏళ్ల జోహన్నా కొంటా గ్రేట్ బ్రిటన్ తరఫున ఆడడానికి ముందు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. కానీ 2021 ఎడిషన్ చివరిలో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించింది.

వీరిద్దరూ ఈ ఏడాది వింబుల్డన్‌కు హాజరవుతారని సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ధృవీకరించారు. టోర్నీ షెడ్యూల్‌ను సానియా మీర్జా తండ్రి ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో సానియా మీర్జా మాజీ డబుల్స్ భాగస్వామి మార్టినా హింగిస్ మరియు నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ కిమ్ క్లిజ్‌స్టర్స్ సహా పలువురు రిటైర్డ్ స్టార్లతో పోటీ పడనుంది.

వింబుల్డన్ 2023 మెయిన్ డ్రాలో ప్రవేశించిన ఏకైక భారతీయుడు రోహన్ బోపన్న(Rohan Bopanna). 43 ఏళ్ల బోపన్న ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో తలపడనున్నాడు. జూలై 5న జరిగే పురుషుల డబుల్స్ ఈవెంట్ తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియన్ ఆటగాడితో కలిసి అర్జెంటీనాకు చెందిన గిల్లెర్మో డురాన్, టోమస్ మార్టిన్ ఎట్చెవెరీతో తలపడనున్నారు.

దీంతో వింబుల్డన్‌లో భారత టెన్నిస్ స్టార్ బోపన్న 13వ సారి ఆడనున్నాడు. రోహన్ బోపన్న స్పందిస్తూ డేవిస్ కప్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని, అయితే తన బాడీ సహకరించే వరకు ATP టూర్‌లో ఆడుతానని ప్రకటించాడు.

వింబుల్డన్ 2023 ప్రధాన రౌండ్ మ్యాచ్‌లు జూలై 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు సంబంధించిన క్వాలిఫైయర్‌లు జూన్ 26న ప్రారంభమై జూన్ 29న ముగుస్తాయి. క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి భారత్‌కు చెందిన అంకితా రైనా. 30 ఏళ్ల అంకిత క్వాలిఫయర్స్ తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన బౌజాస్ మనీరోతో మూడు సెట్లలో ఓడిపోయింది.

టాపిక్

తదుపరి వ్యాసం