తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi 8 Days Collection: భారీగా తగ్గిన ఖుషి వసూళ్లు.. విజయ్, సమంతకు మళ్లీ ప్లాప్.. నష్టమెంతంటే?

Kushi 8 Days Collection: భారీగా తగ్గిన ఖుషి వసూళ్లు.. విజయ్, సమంతకు మళ్లీ ప్లాప్.. నష్టమెంతంటే?

Sanjiv Kumar HT Telugu

09 September 2023, 15:42 IST

google News
  • Kushi 8 Days Worldwide Collection: ఖుషి సినిమాతో అటు విజయ్ దేవరకొండకు, ఇటు సమంతకు, మధ్యలో శివ నిర్వాణకు హిట్ పడుతుందని అంతా భావించారు. కానీ, జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల రాకతో ఖుషి వసూళ్లకు గండి పడింది. ఇక ఖుషి 8 రోజుల కలెక్షన్స్ చూస్తే..

ఖుషి 8 రోజుల కలెక్షన్స్
ఖుషి 8 రోజుల కలెక్షన్స్

ఖుషి 8 రోజుల కలెక్షన్స్

లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ, శాకుంతలం సినిమాతో సమంత ఇద్దరూ ప్లాప్స్ చూశారు. డైరెక్టర్ శివ నిర్వాణ సైతం టక్ జగదీష్ చిత్రంతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ముగ్గురు ఖుషి సినిమాతో మంచి విజయం సాధించాలని అనుకున్నారు. కానీ, అది జరిగేలా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఖుషి సినిమాకు కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. అయితే విడుదలైన తొలి రోజుల్లో మాత్రం ఖుషి బాగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ఇతర సినిమాల ప్రభావంతో కలెక్షన్స్ తగ్గాయి.

ఖుషి 8వ రోజు కలెక్షన్స్

సమంత, విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో సినిమాకు జనాలు పోటేత్తారు. దాంతో కలెక్షన్స్ భారీగా నమోదు అయ్యాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఖుషి సినిమాకు 8వవ రోజున ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్‍, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలిపితే రూ. 22 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఏడో రోజుతో పోలిస్తే రూ. 14 లక్షలు తగ్గాయి.

8 రోజులకు కలిపి

వెన్నెల కిశోర్ తన కామెడీతో అలరించిన ఖుషి చిత్రానికి 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 12.88 కోట్లు, సీడెడ్‍లో రూ. 2.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.77 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, గుంటూరులో రూ. 1.35 కోట్లు, కృష్ణాలో రూ. 1.32 కోట్లు, నెల్లూరులో రూ. 72 లక్షల బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 8 రోజులకు కలిపి ఏపి, తెలంగాణలో రూ. 23.77 కోట్లు షేర్, రూ. 39.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా

ఖుషి మూవీ కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో 8 రోజులకు రూ. 3.25 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 8.56 కోట్లు, ఇతర భాషల్లో రూ. 3.20 కోట్లు రాగా.. వరల్డ్ వైడ్‍గా రూ. 38.78 కోట్ల షేర్, రూ. 73 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ 73 శాతం రికవరీ అయినట్లు తెలుస్తోంది. కాగా రూ. 53.50 కోట్ల టార్గెట్‍తో బరిలోకి దిగిన ఖుషికి ఇంకా రూ. 14.72 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ పూర్తియి.. క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ అంతా రాబట్టకపోతే నిర్మాతలకు నష్టం వచ్చినట్లే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం