తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: 2023లో సమంత చివరి వర్కౌట్ ఇదే.. సామ్ ఇయర్ ఎండింగ్ జిమ్ వీడియో వైరల్

Samantha: 2023లో సమంత చివరి వర్కౌట్ ఇదే.. సామ్ ఇయర్ ఎండింగ్ జిమ్ వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu

30 December 2023, 9:47 IST

  • Samantha Workout Video 2023: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు 2023లో చివరి వర్కౌట్ వీడియోను ఇన్‌స్ట్రా గ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో సమంత వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samantha: 2023లోనే సమంత చివరి వర్కౌట్ ఇదే.. కండరాలు చూపిస్తున్న సామ్ వీడియో వైరల్
Samantha: 2023లోనే సమంత చివరి వర్కౌట్ ఇదే.. కండరాలు చూపిస్తున్న సామ్ వీడియో వైరల్ (Instagram)

Samantha: 2023లోనే సమంత చివరి వర్కౌట్ ఇదే.. కండరాలు చూపిస్తున్న సామ్ వీడియో వైరల్

Samantha Workout Video 2023: సమంత రుత్ ప్రభుకు వర్కవుట్స్ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగులో ఉన్నా, పర్సనల్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నా.. డేలీ చేసే రొటీన్ ఎక్సర్ సైజ్ ఎప్పుడూ మిస్ అవ్వదు. రెండు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. 2023కి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం 2024ను అందరూ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో సమంత కూడా ఉత్సాహంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

అయితే, సమంత ఈ ఇయర్ ఎండింగ్‌ను వర్కౌట్స్‌తో ముగించనుంది. బరువైన ఎత్తు పైకి లేపి మరి 2023ని ముగిస్తున్నట్లు తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీడియో షేర్ చేసింది సమంత. "2023లో చివరిసారిగా వర్కౌట్ చేయడం ప్రారంభమైంది. ఈ సంవత్సరాన్ని మేము ఇలా ఎక్సర్ సైజ్‌తో ముగించనున్నాం" అంటూ వీడియోను తన జిమ్ ట్రైనర్ జునైద్ షేక్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో సమంత 2023 ఇయర్ ఎండింగ్ వర్కౌట్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత నేవీ బ్లూ స్పోర్ట్స్ బ్రా, గ్రే హై వెయిటింగ్ టైట్స్ ధరించింది. అందులో సమంత ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ ఎక్సర్ సైజ్ చేస్తోంది. దాని వల్ల భుజం కండరాలు బలంగా, పెద్దవిగా అవుతాయి. అలాగే ట్రైసెప్స్, ట్రాపెజియస్ కండరాల బలానికి ఈ వ్యాయామయం ఉపయోగపడుతుంది.

వీడియోలో సమంత బ్యూటిఫుల్ మజిల్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. సమంత పక్కనే తన పెంపుడు కుక్న సాషా కూడా ఉంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల విజయ్ దేవరకొండ సరనస నటించిన ఖుషి సినిమా విడుదలైంది. త్వరలో ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ అడాప్షన్‌తో ఓటీటీ ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సిరీస్ సిటాడెల్‌కు ప్రీక్వెల్‌గా రానుందని సమాచారం. సిటాడెల్ సిరీస్‌లో సమంతతోపాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. దీనికి డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్నారు. వీరు ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ సిరీసులు తెరకెక్కించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం