తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha On Citadel: సిటడెల్‌లో ప్రియాంకా చోప్రా తల్లి పాత్రలో సమంత.. ఇది నిజమేనా?

Samantha on Citadel: సిటడెల్‌లో ప్రియాంకా చోప్రా తల్లి పాత్రలో సమంత.. ఇది నిజమేనా?

Hari Prasad S HT Telugu

03 June 2023, 11:22 IST

    • Samantha on Citadel: సిటడెల్‌లో ప్రియాంకా చోప్రా తల్లి పాత్రలో సమంత కనిపిస్తోందా? ఇది నిజమేనా? తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతనే ఈ విషయం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సిటడెల్ ఇంగ్లిష్ ప్రీమియర్ షో సందర్భంగా సమంత
సిటడెల్ ఇంగ్లిష్ ప్రీమియర్ షో సందర్భంగా సమంత

సిటడెల్ ఇంగ్లిష్ ప్రీమియర్ షో సందర్భంగా సమంత

Samantha on Citadel: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మధ్యే సిటడెల్ ఇంగ్లిష్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజైన విషయం తెలుసు కదా. ఇందులో ప్రియాంకా చోప్రా సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించింది. అయితే ఈ క్యారెక్టర్ లో ఆమె స్టంట్స్ తోపాటు కొన్ని బోల్డ్ సీన్లలోనూ రెచ్చిపోయి నటించింది. ఇప్పుడదే సిటడెల్ ఇండియన్ వెర్షన్ కూడా వస్తోంది. ఇందులో సమంత నటిస్తున్న విషయం తెలుసు కదా.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

అయితే ఇంగ్లిష్ లో ప్రియాంకా పాత్రను ఇండియన్ వెర్షన్ లో సమంత పోషిస్తుందని భావించారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ప్రియాంకా చోప్రా తల్లి పాత్రలో సమంత నటిస్తోందట. ఈ విషయాన్ని ఈ-టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతనే చెప్పిందట. కానీ ఇది కేవలం సాంకేతికంగానే అని, నిజానికి ఈ రెండు సిరీస్ లు వేర్వేరు కాలాల్లో జరిగినట్లుగా తీశారని ఆ పోర్టల్ వెల్లడించింది.

సమంత పోషించేది ప్రియాంకా తల్లి పాత్రే అయినా.. ఈ సిరీస్ లో ప్రియాంకా క్యారెక్టర్ ఓ చిన్నారిగా కనిపిస్తుంది. "ఇంటర్నేషనల్, ఇండియన్ వెర్షన్ సిటడెల్ రెండు వేర్వేరు కాలాల్లో జరిగినట్లుగా చూపించినవి. సమంత సిటడెల్ లో ప్రియాంకా పాత్ర ఓ చిన్నారిగా ఉంటుంది. లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఇర్ఫాన్ తల్లి పాత్రలో టబు కనిపించినట్లుగా చెప్పొచ్చు. షూటింగ్ సమయాల్లో అసలు వీళ్లు ఎప్పుడూ కలుసుకోలేదు" అని ఈ సిరీస్ వర్గాలు చెప్పిట్లు ఆ పోర్టల్ తెలిపింది.

అయితే దీనిపై సిటడెల్ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు సిటడెల్ ఇంగ్లిష్ వెర్షన్ ఐదో ఎపిసోడ్ లో ప్రియాంకా పాత్ర అయిన నాదియాకు ఓ కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఆమె తండ్రి అని, అతని పేరు రాహి గంభీర్ అని చెబుతారు. దీనినిబట్టి చూస్తే ఇండియన్ వెర్షన్ లో ఆమె తండ్రి పాత్ర పోషిస్తోంది వరుణ్ ధావన్ అని స్పష్టమవుతోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేనే ఈ సిటడెల్ ఇండియాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సిటడెల్ ప్రపంచాల స్టోరీ కనెక్ట్ అయి ఉంటుందని ప్రియాంకా చోప్రా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఇండియన్ వెర్షన్ షూటింగ్ జరుగుతోంది. దీనికోసం సమంత, వరుణ్ ధావన్ సెర్బియా వెళ్లారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం