Priyanka chopra on fashion: ప్రియాంకా చోప్రా తన ఫొటోలు ఎందుకు కాల్చేసిందంటే..-priyanka chopras fashion advice and reason behind burning her own photos ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Priyanka Chopra's Fashion Advice And Reason Behind Burning Her Own Photos

Priyanka chopra on fashion: ప్రియాంకా చోప్రా తన ఫొటోలు ఎందుకు కాల్చేసిందంటే..

ప్రియాంకా చోప్రా ఫ్యాషన్ సలహా
ప్రియాంకా చోప్రా ఫ్యాషన్ సలహా (Instagram/@priyankachopra)

Priyanka chopra on fashion: ప్రియాంకా చోప్రా ఒక మ్యాగజైన కవర్ ఫొటోలో కనిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన చిన్నప్పటి ఫొటోలు కాల్చేసానంటూ చెప్పొకొచ్చింది. కొన్ని ఫ్యాషన్ సలహాలు కూడా ఇచ్చింది.

ప్రియాంకా చోప్రా తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ ఫొటోకు సంబంధించిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రియాంక దాదాపు 12 ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ ఫొటోల్లో కనిపించింది. ఇప్పుడా జాబితాలో జో రిపోర్ట్ మ్యాగజైన్ కూడా చేరింది. ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన కెరీర్ గురించి, తన ఎమోషన్స్ గురించి, పెళ్లి ముచ్చట్లు ఇలా బోలెడు చెప్పుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

ప్రియాంకా చోప్రా తన స్టైల్ గురించి ఏమందంటే..

ప్రియాంకా చోప్రా గ్లోబల్ స్టార్. బాలీవుడ్, హాలీవుడ్ లో మంచి కెరీర్ తో పాటూ, తన మాటలతో అంతర్జాతీయ వేదికల మీదా గుర్తింపు తెచ్చుకుంది. జో రిపోర్ట్ ఇంటర్వ్యూలో తన స్టైల్ గురించి మాట్లాడుతూ.. “నా స్టైల్ చాలా ప్రత్యేకమైంది. నా పర్సనల్ స్టైల్ మారుస్తూ ఉంటా. ఉదయాన్నే లేవగానే నా మూడ్ బట్టి, సౌకర్యంగా ఉండేలా దుస్తుల్ని ఎంచుకుంటా” అన్నారామె.

నా వెంట చెప్పులు తీస్కెళ్తా:

రెడ్ కార్పెట్ వేడుకలకు హాజరయ్యేటపుడు తన వెంట ఒక జత ఫ్లాట్స్ ఉంచుకుంటుందంట. సౌకర్యంగా ఉండటం, స్టైల్ గా కనిపించడం రెండూ ముఖ్యమే. షేప్ వియర్ వేసుకున్నా కూడా రెడ్ కార్పెట్ షూట్ అయిపోగానే తీసెస్తా. ప్రతిసారీ అవుట్ ఫిట్ కోసం రెండు ఆప్షన్స్ ఉంచుకుంటా. నా మూడ్ ని బట్టి ఏదైనా వేసుకుంటా.

తనకు ఎవరైనా ఇచ్చిన మంచి ఫ్యాషన్ సలహా ఏంటని అడిగితే.. “తక్కువే ఎక్కువ” అని చెప్పింది. ఎంత తక్కువ మినిమల్ లుక్ లో ఉంటే అంత బాగా కనిపించొచ్చన్న మాట.

ఫొటోలు కాల్చేశా:

2000 సంవత్సరం తరువాత కొన్నేళ్ల ఫ్యాషన్ చాయిస్ గురించి ప్రియాంక మాట్లాడింది. అప్పటి కొన్ని ఫొటోలు కూడా కాల్చేసిందట. అపుడు హైలైట్స్, ఐ లైనర్, ఐ షాడో, చెయిన్ డ్రెస్సులు, లో వెయిస్ట్ జీన్స్, స్విమ్ డ్రెస్ కనిపించేలా వేసుకోవడం.. ఇలా ఏవేవో ఫ్యాషన్ ఉండేవి. అందుకే నా ఫొటోలు కాల్చేశా. కానీ నా పుస్తకం రాసేటపుడు ఆ ఫొటోలు అవసరమయ్యి చాలా ఫీల్ అయ్యా అని చెప్పుకొచ్చింది.