Samantha | కష్టసుఖాల్లో ఆమె నా వెన్నంటి నిలిచింది…సమంత ఎమోషనల్ పోస్ట్
04 March 2022, 15:17 IST
హీరోయిన్ సమంత బెస్ట్ ఫ్రెండ్స్‌లో డైరెక్టర్ నందినిరెడ్డి ఒకరు. శుక్రవారం నందినిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది....
సమంత
సినీ పరిశ్రమలో సమంతకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో దర్శకురాలు నందినిరెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ సినిమాలు వచ్చాయి. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా నందినిరెడ్డిని తన ఆప్తురాలిగా సమంత భావిస్తుంటుంది. నందినిరెడ్డితోకలిసి దిగిన ఫొటోలను పలు మార్లు సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. శుక్రవారం నందినిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అమెకు స్పెషల్‌గా శుభాకాంక్షలు చెప్పింది సమంత. నందినిరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మంచి స్నేహితురాలిగా ఉండగలిగేలా అనుక్షణం తనలో నందినిరెడ్డి స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నది. ‘2012లో కెరీర్ పరంగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నా. ఆ సమయంలో మానసికంగా చాలా బలహీనంగా ఉన్నా. ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవడంతో షూటింగ్‌లకు వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యింది. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా. అలాంటి పరిస్థితుల్లో నందినిరెడ్డి నా వెన్నంటి నిలిచి నాలో ధైర్యాన్ని నింపింది. ప్రతి రోజు యోగక్షేమాల్ని తెలుసుకుంటూ నాలో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చింది. తన బిజీ షెడ్యూల్స్‌లో కూడా నాపై టెస్ట్ షూట్ చేసి తిరిగి షూటింగ్స్ కు వెళ్లేలా నాలో కాన్ఫిడెన్స్‌ను నింపింది. ఆ తర్వాత రోజు ఎంతో ధైర్యంతో సెట్స్ లో అడుగుపెట్టా. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క సమయంలోనే కాదు ఎన్నో క్టిష్ల పరిస్థితుల్లో నందినిరెడ్డి నా వెన్నంటి నిలిచింది. నేను విజయాల్ని సాధించిన సందర్భాల్లో, కష్ట సమయాల్లో నాతో కలిసి ప్రయాణించిన స్నేహితురాలికి శుభాకాంక్షలు’ అంటూ సమంత పేర్కొన్నది. నందినిరెడ్డితో సీరియస్‌గా ముచ్చటిస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. సమంత పెట్టిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సమంత తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు నందినిరెడ్డి ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమా చేస్తోంది. సంతోష్‌శోభన్, మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.