తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sam Bahadur Ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న సామ్‍ బహదూర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Sam Bahadur OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సామ్‍ బహదూర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

22 January 2024, 17:45 IST

google News
    • Sam Bahadur OTT Release Date: ఆర్మీ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ‘సామ్ బహదూర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ స్ట్రీమిండ్ డేట్ ఖరారైంది.
Sam Bahadur OTT Sam Bahadur OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్కీ కౌశల్ ‘సామ్‍బహదూర్’ మూవీ
Sam Bahadur OTT Sam Bahadur OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్కీ కౌశల్ ‘సామ్‍బహదూర్’ మూవీ

Sam Bahadur OTT Sam Bahadur OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్కీ కౌశల్ ‘సామ్‍బహదూర్’ మూవీ

Sam Bahadur OTT Release Date: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించిన ‘సామ్ బహదూర్’ చిత్రానికి చాలా ప్రశంసలు దక్కాయి. భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్‍ సామ్ మనెక్‍షా జీవితం ఆధారంగా యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో ఈ బయోగ్రఫికల్ మూవీ తెరకెక్కింది. సామ్ బహదూర్ చిత్రానికి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్, ప్రశంసలు దక్కించుకుంది. మోస్తరు వసూళ్లను రాబట్టింది.

సామ్ బహదూర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ స్ట్రీమింగ్‍పై జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. రిపబ్లిక్ డే అయిన జనవరి 26వ తేదీన ‘సామ్ బహదూర్’ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. భారత అతిగొప్ప సైనికుడు అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.

“ఓ దార్శనికత కలిగిన నాయకుడు, దిగ్గజం, నిజమైన హీరో మీ స్క్రీన్‍లను కమాండ్ చేయడానికి వస్తున్నారు! జనవరి 26వ తేదీన జీ5లో సామ్‍ బహదూర్ ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (జనవరి 22) ట్వీట్ చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

సామ్ బహదూర్ మూవీలో సామ్ మనెక్‍షా పాత్ర చేసిన విక్కీ కౌశల్‍కు నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. మేకోవర్ నుంచి నటన వరకు ఆయన అద్భుతంగా చేశారు. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్రా, నీరజ్ కబీ, రాజీవ్ కర్చూ, మహమ్మద్ జీషన్ అయూబ్, ఎడ్వర్డ్ సోనెన్‍బ్లిక్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మేఘన గుల్జర్ తెరకెక్కించిన విధానం మెప్పించింది.

సామ్ మనెక్‍షా జీవితం, ఆయన సాధించిన ఘనతల ఆధారంగా సామ్ బహదూర్ చిత్రం తెరకెక్కింది. 1962 భారత్, చైనా యుద్ధం, 1971 భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉన్నాయి. ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్‍గా సామ్ మనెక్‍షా ఉన్న సమయంలో భారత ఆర్మీ సాధించిన గొప్ప విజయాలను ఈ సినిమాలో మేకర్స్ చూపించారు.

సామ్ బహదూర్ చిత్రానికి కేతన్ సోధా, శంకర్ - ఇషాన్ - లాయ్ సంగీతం అందించారు. ఆర్ఎస్‍వీపీ మూవీస్ పతాకంపై రోనీ స్క్రీవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.55 కోట్ల బడ్జెట్‍ ఈ చిత్రం రూపొందినట్టు అంచనా. రూ.130 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ మూవీ రాబట్టింది.

నేరు ఓటీటీ రిలీజ్

మలయాళ సినిమా ‘నేరు’ కూడా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జనవరి 23వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. అనస్వర రాజన్, ప్రియమణి, శాంతి మాయాదేవి, సిద్ధిఖీ, జగదీశ్ కీలకపాత్రలు చేశారు. థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న నేరు ఇప్పుడు జనవరి 23న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం