తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan Kisses Sangeeta : మాజీ ప్రియురాలిని కిస్ చేసిన సల్మాన్ ఖాన్..

Salman Khan Kisses Sangeeta : మాజీ ప్రియురాలిని కిస్ చేసిన సల్మాన్ ఖాన్..

Anand Sai HT Telugu

27 December 2022, 17:13 IST

    • Salman Khan Birthday Party : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
మాజీ ప్రియురాలిని ముద్దాడిన సల్మాన్ ఖాన్
మాజీ ప్రియురాలిని ముద్దాడిన సల్మాన్ ఖాన్

మాజీ ప్రియురాలిని ముద్దాడిన సల్మాన్ ఖాన్

మాజీ ప్రియురాలిని సల్మాన్ ఖాన్(Salman Khan) ముద్దుపెట్టుకున్నాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. పుట్టిన రోజు సందర్భంగా.. సల్మాన్ ఖాన్ డిసెంబర్ 26న విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశాడు. దీనికి పలువురు బాలీవుడ్(Bollywood) ప్రముఖులు హాజరయ్యారు. సంగీతా బిజ్లానీ(Sangeeta Bijlani) కూడా బర్త్ డే పార్టీకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Smile Review: ఆ నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

సల్మాన్ ఖాన్.. 80వ దశకంలో సంగీతా బిజ్లానీతో ప్రేమలో ఉన్నాడు. సుమారు 10 సంవత్సరాలు డేటింగ్(Dating) చేశారు. పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో వ్యక్తిగత కారణాలతో వీడిపోయాడు. అయితే పార్టీ సమయంలో సంగీత నుదిటిపై సల్మాన్ ఖాన్ ముద్దుపెట్టాడు. ఈ ఫోటో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవలసిందే అని వ్యాఖ్యానించారు.

సల్మాన్ ఖాన్(Salman Khan) 57వ వసంతంలోకి అడుగుపెట్టాడు. అతడి సోదరి అర్పితా ఖాన్‌ నివాసంలో గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకకు షారుక్‌ ఖాన్‌(Sharukh Khan), జాన్వీకపూర్‌, పూజా హెగ్డే(Pooja Hegde), టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్‌ఆర్యన్‌తోపాటుగా.. కొంతమంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పార్టీకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా హాజరైన విషయం తెలిసిందే. సల్మాన్, షారుఖ్ ఒక చోట కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సల్మాన్‌, షారుక్‌ను ఒకే ఫ్రేమ్​లో చూసిన ఫ్యాన్స్‌ ఆనందపడుతున్నారు. షారుఖ్ నటిస్తున్న ఓ చిత్రంలో సల్మాన్ ఖాన్(Salman Khan) అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కండల వీరుడికి అభిమానులు నుంచి, సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పార్టీలో పూజా హెగ్డే(Pooja Hegde) పాల్గొన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 'కిసి కా భాయ్, కిసి కి జాన్' సినిమా కారణంగా సల్మాన్ తో పూజకు స్నేహం బాగా పెరిగిందని అంటున్నారు. ఈ చిత్రానికి పూజా హెగ్డే హిరోయిన్. సల్మాన్ బర్త్ డే పార్టీ(Salman Birthday Party)లో పూజా హెగ్డేకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.