తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan-iulia Vantur: గర్ల్‌ఫ్రెండ్ లూలియా వంటూర్ బర్త్‌డే వేడుకలో సల్మాన్

Salman Khan-Iulia Vantur: గర్ల్‌ఫ్రెండ్ లూలియా వంటూర్ బర్త్‌డే వేడుకలో సల్మాన్

HT Telugu Desk HT Telugu

25 July 2022, 11:28 IST

google News
    • సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ లూలియా వంటూర్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
లూలియా వంటూర్ (ఫైల్ ఫోటో)
లూలియా వంటూర్ (ఫైల్ ఫోటో) (Sunil Khandare)

లూలియా వంటూర్ (ఫైల్ ఫోటో)

న్యూఢిల్లీ, జూలై 25: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆదివారం తన స్నేహితురాలు లూలియా వంటూర్ పుట్టినరోజును తన కుటుంబం, స్నేహితులతో జరుపుకున్నారు.

నటుడు ఆయుష్ శర్మ వేడుకకు సంబంధించిన ఒక గ్రూప్ ఫోటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు లూలియా వంటూర్.. మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ, ఆనందాన్ని పంచుతూ ఉండండి’ అని క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.

ఫోటోలో 'సుల్తాన్' హీరో సల్మాన్ ఖాన్, అతని తమ్ముడు సోహైల్ ఖాన్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నికేతన్ మధోక్, బర్త్ డే గర్ల్ లూలియా వంటూర్ ఉన్నారు.

'సెల్ఫిష్' సింగర్ లూలియా జూలై 24న 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

ఆమె తన బర్త్ డే వేడుక నుండి ఒక వీడియోను షేర్ చేశారు. ‘నా ప్రేమికులారా, ఈ రోజు నేను మీ ప్రేమలో మునిగిపోయాను. ఈ ప్రేమను పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నాకు ఇంత మంచి ఆత్మీయులు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స్నేహితులు, నేను ప్రేమించే కుటుంబం, నేను విశ్వసించే వ్యక్తులు.. నా పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు అబ్బాయిలు.. నా జీవితం మీ వల్ల చాలా ఆనందంగా ఉంది..’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఈ రొమేనియన్ సింగర్ అందమైన నల్లటి దుస్తులలో కనిపించగా, సల్మాన్ మ్యాచింగ్ బ్లాక్ షర్ట్‌లో కనిపించాడు.

సల్మాన్‌, లూలియా వంటూర్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

లూలియా 'మైన్ చలా' పాట కోసం గాయకుడు గురు రంధవాతో కలిసి పనిచేసింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి సల్మాన్ ఖాన్ కనిపించారు.

సల్మాన్ తదుపరి సాజిద్ నడియాడ్‌వాలా 'కభీ ఈద్ కభీ దివాలీ'లో పూజా హెగ్డేతో కలిసి నటించనున్నారు. ఇది డిసెంబర్ 30, 2022న విడుదల కానుంది.

అతను కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీతో కలిసి యష్ రాజ్ ఫిల్మ్ 'టైగర్ 3' లో కూడా కనిపించనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం