తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar 6 Days Collection: 500 కోట్లకు దగ్గరిగా సలార్.. కానీ, అక్కడ మాత్రం షారుక్ డంకీ మూవీకే ఎక్కువ!

Salaar 6 Days Collection: 500 కోట్లకు దగ్గరిగా సలార్.. కానీ, అక్కడ మాత్రం షారుక్ డంకీ మూవీకే ఎక్కువ!

Sanjiv Kumar HT Telugu

28 December 2023, 12:01 IST

google News
  • Salaar 6 Days Box Office Collection: ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్‌కు ఆరో రోజు వసూళ్లు తగ్గినట్లే తెలుస్తోంది. ఇండియాలో రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్ సినిమాను అధిగమించినప్పటికీ, ఓవర్సీస్ కలెక్షన్స్ లో షారుఖ్ ఖాన్ డంకీ కంటే ప్రభాస్ సలార్ వెనుక ఉంది.

500 కోట్లకు దగ్గరిగా సలార్.. కానీ, అక్కడ మాత్రం షారుక్ డంకీ మూవీకే ఎక్కువ
500 కోట్లకు దగ్గరిగా సలార్.. కానీ, అక్కడ మాత్రం షారుక్ డంకీ మూవీకే ఎక్కువ (Screengrab from YouTube/Hombale Films)

500 కోట్లకు దగ్గరిగా సలార్.. కానీ, అక్కడ మాత్రం షారుక్ డంకీ మూవీకే ఎక్కువ

Salaar 6 Days Box Office Collection: ప్రభాస్ నటించిన సలార్: సీజ్ ఫైర్ - పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఆరు రోజుల రన్ పూర్తి చేసుకుంది. అయితే సలార్‌కు ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 240.97 కోట్ల షేర్, 434.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఆరో రోజుతో ఈ కలెక్షన్స్ పెరిగాయి.

సలార్ 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా రూ. 8-9 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకోనుంది. హిందీలో మాత్రం రూ. 10 కోట్ల వరకు గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళం, కేరళ, ఓవర్సీస్‌లలో రూ. 5 కోట్ల వరకు గ్రాస్ వసూళు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సలార్ మూవీకి 6వ రోజున వరల్డ్ వైడ్‌గా రూ. 24 నుంచి 25 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అయ్యాయి. మొత్తంగా సలార్‌కు 6 రోజుల్లో రూ. 458 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే సుమారుగా రూ. 500 కోట్లకు దగ్గరిలో సలార్ ఉంది. ఈ వీకెండ్‌లో 500 కోట్లను అధిగమించడం సలార్‌కు సులువనే అనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇండియాలో సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే ఓవర్సీస్‌లో మాత్రం షారుక్ ఖాన్ డంకీ పైచేయి సాధించింది. ఓవర్సీస్‌లో సలార్‌కు ఐదు రోజుల్లో రూ. 98 కోట్లు వస్తే డంకీ రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. అంటే అతి స్వల్ప తేడాతో ఓవర్సీస్‌లో డంకీ కంటే సలార్ వెనుకంజలో ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం