Saindhav OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి సైంధవ్ - ఈ సారి ఓటీటీలో మహేష్ బాబుతో వెంకటేష్ పోటీ
22 January 2024, 11:27 IST
Saindhav OTT: థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే సైంధవ్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
వెంకటేష్ సైంధవ్ మూవీ
Saindhav OTT: వెంకటేష్ సైంధవ్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. సైంధవ్ డిజిటల్ హక్కులు పదిహేను కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. త్వరలోనే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
శాటిలైట్ హక్కులు ఏ ఛానల్‌కంటే...
థియేటర్ రిజల్ట్ కారణంగానే నెల రోజులు కూడా గడవక ముందే సైంధవ్ ఓటీటీలోకి వస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. వెంకటేష్ యాక్టింగ్ బాగున్నా కథ, కథనాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ మధ్య కనెక్టివిటీ మిస్సవ్వడంతో సైంధవ్‌ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తొలుత ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ థియేటర్లలో షాకింగ్ రిజల్ట్ రావడంతో ఫిబ్రవరి 9నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైంధవ్ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు సమాచారం.
మహేష్ తో పోటీ...
థియేటర్లలో సంక్రాంతికి మహేష్‌బాబుతో పోటీ పడ్డాడు వెంకటేష్. గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ కాగా...సైంధవ్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోసారి ఓటీటీలో మహేష్, వెంకీ పోటీపడబోతున్నట్లు సమాచారం. గుంటూరు కారం, సైంధవ్ ఓకేరోజు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓటీటీ వెర్షన్‌లో మార్పులు...
థియేటర్‌లో పోలిస్తే సైంధవ్ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ వెర్షన్‌లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు సాంగ్‌ను కూడా యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌లో లెంగ్త్ ఎక్కువైందనే ఆలోచనతో ఈ సీన్స్ డిలీట్ చేసినట్లు తెలిసింది. వీటిని ఓటీటీలో యాడ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సైకో కథ...
సైంధవ్ సినిమాకు హిట్, హిట్ 2 చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. గత సినిమాలకు భిన్నంగా యాక్షన్ ఇంటెన్స్ డ్రామాతో శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కించాడు. తన కూతురి ప్రాణాలను దక్కించుకోవడానికి కార్టెల్ అనే మాఫియా గ్యాంగ్‌తో సైంధవ్ అలియాస్ సైకో ఎలాంటి పోరాటం సాగించాడు. కార్టెల్‌లోనే పనిచేసిన సైకో దాని నుంచి ఎందుకు బయటకు వచ్చాడన్నదే సైంధవ్ మూవీ కథ. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. రుహాణి శర్మ డాక్టర్‌గా నటించగా...ఆండ్రియా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేసింది.
తెలుగులోనే రిలీజ్...
బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా సైంధవ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ హీరో ఆర్య...వెంకటేష్ స్నేహితుడిగా నటించాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ థియేటర్లు దొరక్కపోవడంతో తెలుగులోనే సైంధవ్ రిలీజైంది.
సైంధవ్ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. సైంధవ్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్‌తో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రానా నాయుడు సీజన్ 2లో వెంకటేష్ నటించనున్నాడు. ఈ ఏడాది చివరలో రానా నాయుడు సీజన్ 2 రిలీజ్ కాబోతోంది.