Saindhav OTT Release: అఫీషియల్...సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వెంకటేష్ మూవీ
31 January 2024, 13:25 IST
Saindhav OTT Release: వెంకటేష్ సైంధవ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా బుధవారం అనౌన్స్‌చేశారు. ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైంధవ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
వెంకటేష్ సైంధవ్ మూవీ
Saindhav OTT Release: వెంకటేష్ సైంధవ్ మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను బుధవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సైంధవ్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం భాషల్లో సైంధవ్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ అనౌన్స్‌చేసింది. సైంధవ్ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు సమాచారం.
ఇరవై రోజులే గ్యాప్...
సంక్రాంతి కానుకగా జనవరి 13న వెంకటేష్ సైంధవ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేస్తోండటం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలవడంతోనే ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు చెబుతోన్నారు. సైంధవ్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
వెంకీ కామెడీ, ఎమోషన్స్...
యూనివర్సల్ కాన్సెప్ట్‌తో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సైంధవ్ ను తెరకెక్కించాడు శైలేష్ కొలను. తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలకు మధ్య కనెక్షన్ సరిగ్గా కుదరకపోవడం, వెంకటేష్ సినిమాల్లో ఉండే కామెడీ, సెంటిమెంట్ మిస్సవ్వడంతో సైంధవ్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. మరోవైపు సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్‌తో పాటు నా సామిరంగ కూడా రిలీజ్ కావడంతో సైంధవ్ కలెక్షన్స్‌పై గట్టి ఎఫెక్ట్ పడింది. దాదాపు ఇరవై ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ పది కోట్ల లోపే వసూళ్లను సాధించి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.
సైకోగా వెంకటేష్...
సైంధవ్ సినిమాలో సైకో అనే గ్యాంగ్‌స్టర్‌గా, ఓ చిన్నారికి తండ్రిగా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వెంకటేష్ నటించాడు. తన కూతురి ప్రాణాల కోసం కార్టెల్ అనే మాఫియా గ్యాంగ్‌తో సైకో ఎలాంటి పోరాటం సాగించాడు?కార్టెల్‌లోనే పనిచేసిన సైకో దాని నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? తన కూతురి ప్రాణాలను కాపాడటానికి పదిహేడు కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను సైకో ఎలా తెప్పించగలిగాడు అన్నదే ఈ మూవీ కథ.
పాన్ ఇండియన్ ఆర్టిస్టులు...
పాన్ ఇండియన్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్, కోలీవుడ్ ఆర్టిస్టులు సైంధవ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హిందీ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ సైంధవ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్‌గా నటించాడు. కోలీవుడ్ హీరో ఆర్య...వెంకటేష్ స్నేహితుడి పాత్రను పోషించారు.
సైంధవ్‌లో వెంకటేష్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. రుహాణిశర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సంక్రాంతికి ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ థియేటర్లు దొరక్కపోవడంతో తెలుగులోనే సైంధవ్ రిలీజైంది. తాజాగా ఓటీటీ ద్వారా తమిళంలో సైంధవ్ మూవీ రిలీజ్ అవుతోంది.
సైంధవ్ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. సైంధవ్ తర్వాత వెంకటేష్ మూవీ ఏదన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అతడి నెక్స్ట్ మూవీకి దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. నాని, వెంకటేష్‌లతో త్రివిక్రమ్ ఓ మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రానా నాయుడు సీజన్ 2లో వెంకటేష్ నటించనున్నాడు.