తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav 11 Days Box Office Collections: డిజాస్టర్‌గా మిగిలిపోయిన సైంధవ్.. బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలోనే..

Saindhav 11 days Box Office Collections: డిజాస్టర్‌గా మిగిలిపోయిన సైంధవ్.. బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలోనే..

Hari Prasad S HT Telugu

24 January 2024, 16:30 IST

google News
    • Saindhav 11 days Box Office Collections: విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన సైంధవ్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలోనే నిలిచిపోయింది.
డిజాస్టర్ గా మిగిలిపోయిన సైంధవ్ మూవీ
డిజాస్టర్ గా మిగిలిపోయిన సైంధవ్ మూవీ

డిజాస్టర్ గా మిగిలిపోయిన సైంధవ్ మూవీ

Saindhav 11 days Box Office Collections: ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఒకటిగా వచ్చిన వెంకటేశ్ సైంధవ్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. జనవరి 13న రిలీజైన ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.18 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

పైగా రిలీజ్ కు ముందు కూడా రూ.25 కోట్ల బిజినెస్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.8 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి.. వెంకటేశ్ కెరీర్లో పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ముగిసిన సైంధవ్ ఫైట్

జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సైంధవ్ రిలీజైంది. అయితే అంతకుముందు రోజే అంటే జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ రిలీజయ్యాయి. మరుసటి రోజు జనవరి 14న నాగార్జున నా సామిరంగ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు సినిమాలతో పోలిస్తే సైంధవ్ సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

తొలి రోజు కేవలం రూ.3.6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక తొలి రోజు నుంచే వచ్చిన నెగటివ్ టాక్ తో కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. సంక్రాంతి హాలీడేస్ లోనూ ఈ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. రెండో వీకెండ్ వచ్చేసరికి అసలు చాలా థియేటర్లలో నుంచి సైంధవ్ కనపించకుండా పోయింది. మొత్తంగా 11 రోజుల్లో కేవలం రూ.18 కోట్లు మాత్రమే వచ్చాయి.

బోల్తా పడిన వెంకటేశ్

మామూలుగా ఫ్యామిలీ హీరోగా పేరుగాంచిన వెంకటేశ్ సినిమాలు సంక్రాంతికి మంచి వసూళ్లే రాబడతాయి. కానీ సైంధవ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఫలితాన్ని ఇచ్చింది. ఈ మూవీ జానర్ ఫెస్టివల్ మూడ్ కు తగినట్లు లేకపోవడం, హనుమాన్, నా సామిరంగ సినిమాలకు మంచి టాక్ రావడం కూడా సైంధవ్ డిజాస్టర్ గా మిగిలిపోవడానికి కారణాలుగా చెప్పొచ్చు.

యాక్షన్ జానర్ లో వచ్చిన సైంధవ్ బయర్లను నిండా ముంచింది. ఈ ఫలితం వెంకటేశ్ కు మింగుడుపడనిదే. హిట్, హిట్ 2లాంటి మంచి హిట్ సినిమాలు అందించిన శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన సైంధవ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా మాత్రం ఆ స్థాయిలో లేదు. వెంకీ ఫ్యాన్స్ కు కూడా ఈ మూవీ పెద్దగా నచ్చలేదు.

సాదాసీదా లైఫ్‌ను లీడ్ చేసే హీరోకు ప‌వ‌ర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉండ‌టం అనే పాయింట్‌ను. ఫ్యాక్ష‌న్‌, మాఫియా, గ్యాంగ్‌స్ట‌ర్స్ అన్ని జోన‌ర్స్‌లో వాడేశారు టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌. ఆ పాయింట్‌ను తీసుకొని కొత్త క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో శైలేష్ కొల‌ను ఈ క‌థ రాసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది. హీరోకు ఓ రేంజ్‌ ష్లాఫ్‌బ్యాక్‌..అత‌డికి స‌పోర్ట్‌గా నిలిచే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌... ధీటైన‌ విల‌న్స్...అన్ని ఉన్నా సినిమాలో ఏదో మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది.

యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ మ‌ధ్య కొన్ని సార్లు క‌నెక్టివిటీ కనిపించదు.సైకో నుంచి వెంక‌టేష్ సైంధ‌వ్‌గా సాదాసీదా ఫ్యామిలీ మ్యాన్‌గా ఎందుకు మారాడ‌న్న‌ది స‌రిగా చూపించ‌లేదు. ఆర్య‌, రుహాణిశ‌ర్మ‌, ఆండ్రియాతో పాటు చాలా మంది ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు ఉన్నా వారి టాలెంట్‌ను పూర్తిస్థాయిలో వాడుకోలేద‌నిపిస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం