తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Pallavis Gargi Ottt Release Date Announced By The Makers

Gargi OTT Release: సాయిపల్లవి గార్గి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎందులోనో తెలుసా?

HT Telugu Desk HT Telugu

03 August 2022, 22:19 IST

    • Gargi OTT Release: సాయిపల్లవి నటించిన గార్గి మూవీ ఓటీటీ రిలీజ్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. రిలీజ్‌ సమయంలో మిక్స్‌డ్‌ రివ్యూలను సంపాదించుకున్న ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది.
గార్గి మూవీలో సాయిపల్లవి
గార్గి మూవీలో సాయిపల్లవి (Twitter)

గార్గి మూవీలో సాయిపల్లవి

టాలీవుడ్‌తోపాటు దక్షిణాది భాషల్లో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదుగుతోంది సాయి పల్లవి. ఆమె ఈ మధ్యే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ అయిన విరాట పర్వం, గార్గి మూవీల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకలోకం నీరాజనం పట్టినా.. కమర్షియల్‌గా మాత్రం ఈ మూవీస్‌ సక్సెస్‌ సాధించలేకపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

Shriya Reddy Web Series: త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై శ్రియారెడ్డి వెబ్‌సిరీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్ - రిలీజ్ ఎప్పుడంటే?

Sundar C: ఆ ప్రాంతాన్నంత చేతబడి చేశారు.. హీరోయిన్ ఖుష్బూ భర్త షాకింగ్ కామెంట్స్

Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ - సుహాస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prasanna Vadanam Twitter Review: ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ- సుహాస్ ఫేస్ బ్లైండ్‌నెస్‌ సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా

విరాట్‌ పర్వం అయితే థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రాగా.. తాజాగా గార్గి కూడా వచ్చేస్తోంది. జులై 15న ఈ సినిమా రిలీజ్‌ కాగా.. నెల రోజుల్లోపే అంటే ఆగస్ట్‌ 12న గార్గి ఓటీటీలోకి రానుంది. సోనీ లివ్‌ ఈ మూవీ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. కొన్ని నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్ట్‌ డ్రామాలో తన తండ్రిని రక్షించుకునేందుకు పోరాడే కూతురి పాత్రలో సాయిపల్లవి కనిపించింది.

తెలుగు, కన్నడ, తమిళంలలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు సోనీ లివ్‌ ఓటీటీలోనూ మూడు భాషల్లో రానుంది. గార్గి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఇటు మూవీ మేకర్స్‌, అటు సోనీ లివ్‌ ఓటీటీ కూడా అధికారికంగా ప్రకటించారు. రవిచంద్రన్‌ రామచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించారు.

గార్గి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి జీవించింది. తండ్రిపై అంతులేని ప్రేమాభిమానాలు ఉన్న కూతురిగా, నిజాన్ని బ‌తికించ‌డం కోసం పోరాటం చేసే యువ‌తిగా చ‌క్క‌టి ఎమోష‌న్స్ ప‌డించింది. ఆమె క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగానే ఈ సినిమా సాగుతుంది. ప్ర‌తి సీన్ లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. సాయిప‌ల్ల‌వి తండ్రిగా సీనియ‌ర్ న‌టుడు ఆర్ ఎస్ శివాజీ అద్భుతమైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.