తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: సాయిప‌ల్ల‌వి గార్గి ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే...

sai pallavi: సాయిప‌ల్ల‌వి గార్గి ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే...

HT Telugu Desk HT Telugu

16 July 2022, 6:21 IST

  • గార్గి (gargi) సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది సాయిప‌ల్ల‌వి(saipallavi). సామాజిక ఇతివృత్తంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.  గార్గి సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

సాయిప‌ల్ల‌వి
సాయిప‌ల్ల‌వి (twitter)

సాయిప‌ల్ల‌వి

సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా నటించిన గార్గి మంచి సినిమాగా అందరి మ‌న్న‌న‌ల్ని అందుకొంటుంది. సామాజిక స‌మ‌స్య‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ను మేళ‌వించి ద‌ర్శ‌కుడు గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. గార్గి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి మరోమారు తన నటనతో ఆకట్టుకుంది. తండ్రికి న్యాయం జ‌ర‌గాల‌ని పోరాటం చేసే కూతురిగా భావోద్వేగప్రధానంగా సాగే క్యారెక్టర్ లో సహజ నటనను కనబరిచింది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

తెలుగు,త‌మిళ భాష‌ల్లో ఇటీవ‌లే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగు వెర్ష‌న్‌కు హీరో రానా(rana),త‌మిళ సినిమాకు కథానాయకుడు సూర్య(surya) ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. మౌత్‌టాక్ బాగున్నా గార్గికి ఓపెనింగ్స్ మాత్రం పెద్ద‌గా రావ‌డం లేదు. సాయిప‌ల్ల‌వి గ‌త చిత్రాల‌తో పోలిస్తే గార్గి చాలా త‌క్కువ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకురాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను సోనిలివ్(sonyliv) ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. ఆగ‌స్ట్ ఫ‌స్ట్‌వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

థియేట‌ర్ లో పెద్ద‌గా ఆద‌ర‌ణ లేక‌పోవడంతోనే త్వ‌ర‌గా ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది. ఈ సినిమాకు కోలీవుడ్ క‌థానాయిక ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. విరాటపర్వం తర్వాత సాయిపల్లవికి ఈ సినిమాతో మరో ఫ్లాప్ ఎదురైంది. లవ్ స్టోరీ మినహా గత నాలుగేళ్ల లో సాయిపల్లవికి కెరీర్ లో భారీ సక్సెస్ లు లేవు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.