Dil Raju on Producers council: టాలీవుడ్‌లో దిల్ రాజు ప్రభావం.. నిర్మాతల మండలికి హెడ్ కావాలనుకుంటున్నారా?
08 February 2023, 9:38 IST
- Dil Raju on Producers council: టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఆయన త్వరలో జరగబోయే ప్రొడ్యూసర్ల కౌన్సిల్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దిల్ రాజు
Dil Raju on Producers council: తెలుగు చిత్రసీమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ఎలాంటి వార్త వచ్చిన ఇట్టే ట్రెండ్ అవుతోంది. గత రెండు రోజుల నుంచి ఈ బడా ప్రొడ్యూసర్ గురించి వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మరో నిర్మాత అల్లు అరవింద్ నిన్న ప్రెస్ మీట్‌కు ఆహ్వానించినప్పుడు ఆయన వార్తల్లో భాగమయ్యారు. తర్వాత ఆ మీట్ రద్దయింది. అయితే ఊహాగానాలు మాత్రం దిల్ రాజు చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా మరోసారి దిల్ రాజు వార్తల్లో నిలిచారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నామినేట్ వేశారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పటికే ఆయన యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌కు పోటీ పడటం ఆసక్తికరంగా మారింది.
కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా వ్యాపారంలో రోజూ ఉండే పెద్ద నిర్మాతల సమస్యలను చర్చించుకునేందుకే తాము యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ను ప్రారంభించామని తెలిపారు. అంతేకాకుండా ప్రెసిడెంట్ అవడానికి నిర్మాతల మండలికి ఎలాంటి ఎన్నికలు అవసరం లేదని, అయితే వారు ఆ నిర్వహణ అధికారాన్ని ఎవరికైనా అప్పగించవచ్చని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే భారత్‌లో ఏర్పాటైన ఏ సంఘానికైనా నియమాలు, నిబంధనలు ఉంటాయి. అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా మాత్రమే ఎంచుకోవాలి.
దీంతో విషయాన్ని గ్రహించిన దిల్ రాజు ఇప్పుడు నిర్మాతల మండలిలో కూడా తన సత్తా చాటాలని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యుసర్ల కౌన్సిల్ అధ్యక్ష పదవీకి నామినేషన్ దాఖలు చేశానని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గిల్డ్ సభ్యులు స్రవంతి రవికిషోర్, దామోదర ప్రసాద్, దిల్ రాజు తదితరులు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో గెలిచినా.. అది నిర్మాతల మండలి, గిల్డ్ రెండింటికీ నాయకత్వం వహించేలా చేస్తుంది.
మరోపక్క నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కావడానికి ఇప్పటికే అవసరమైన ఓట్లను దిల్ రాజు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అంతర్గత కథనాలు చెబుతున్నాయి. అయితే అల్లు అరవింద్ టీమ్ దిల్ రాజుకు సపోర్ట్ చేస్తే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇప్పుడు పరిస్థితి ఆసక్తికరంగా మారింది.