RRR Collections | నైజాంలో నివ్వెరపోయే వసూళ్లు.. వంద కోట్ల షేర్‌తో RRR సునామీ
06 April 2022, 11:58 IST
- తారక్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా నైజాంలో సరికొత్త రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా ఈ సినిమా నైజాంలో వంద కోట్ల షేర్ అధిగమించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా త్వరలో ఈ చిత్రం రూ.1000 కోట్ల గ్రాస్‌ను అధిగమించనుంది.
ఆర్ఆర్ఆర్ వసూళ్ల సునామీ
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలై 10 రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. పాన్ఇండియా వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు నిరాజనాలు పలుకుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఫలితంగా భాషతో సంబంధం లేకుండా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా నైజాంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వంద కోట్ల మైలు రాయిని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
నైజాం ఏరియాలో ట్రిపుల్ ఆర్ అదిరిపోయే వసూళ్లను సాధించింది. 100 కోట్ల మైలురాయిని అధిగమించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించిందని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. కేవం నైజాం షేరే వంద కోట్లు దాటిందంటే భవిష్యత్తులో మరిన్ని రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.
విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను సాధిస్తుందో. ఇప్పటికే రూ.900 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. అతిత్వరలోనే ఆ రికార్డును బద్దలు కొట్టనుంది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్‌లో అడుగుపెట్టిందని, 12 రోజుల్లోనే ఈ ఘనతను సాధించిందని పేర్కొన్నాయి.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
టాపిక్