తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroine In Vinodaya Sitham: వినోదాయ సీతం రీమేక్‌లో రొమాంటిక్ హీరోయిన్.. ఎవరంటే?

Heroine In Vinodaya Sitham: వినోదాయ సీతం రీమేక్‌లో రొమాంటిక్ హీరోయిన్.. ఎవరంటే?

10 February 2023, 8:13 IST

    • Heroine In Vinodaya Sitham: టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ వినోదాయ సీతం రీమేక్‌లో ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో ఇక్కడ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇంత వరకు సరైన బ్రేక్ పడలేదు.
కేతిక శర్మ
కేతిక శర్మ

కేతిక శర్మ

Heroine In Vinodaya Sitham: చిత్రసీమలో ఎవరికీ అదృష్టం అంత త్వరగా కలిసి రాదు. అందం, అభినయంతో పాటు లక్ కూడాదోహదం చేస్తేనే ఇక్కడ సక్సెస్ కావడం జరుగుతుంది. స్టార్ హీరోయిన్లు సైతం ఇలాంటి అవరోధాలు ఎదుర్కొనే ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకున్నారు. అందంతో పాటు రొమాంటిక్ ఇమేజ్‌ ఉన్న కేతిక శర్మ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుస పెట్టి పరాజయాలు తోడవ్వడంతో టాలీవుడ్‌లో అవకాశాలు కోసం ఇబ్బంది పడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఇందులో ఈ అమ్మడు అందాల ప్రదర్శనకు యువత ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కేతిక తన తదుపరి ప్రాజెక్ట్ నాగశౌర్య లక్ష్య సినిమాపైనే పెట్టుకుంది. అయితే ఈ చిత్రం కూడా ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమా కూడా నిరాశనే మిగల్చడంతో బ్రేక్ కోసం తీవ్రంగా చూస్తోంది.

తాజాగా మరోసారి మెగా హీరోనే నమ్ముకోనుంది కేతిక. సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న వినోదాయ సీతం రీమేక్‌లో కేతిక శర్మకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైష్ణవ్‌తో కలిసి రాని అదృష్టం సాయి ధరమ్ తేజ్ సినిమాతోనైనా కలిసొస్తుదేమోనని ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భగవంతుడిగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో కీతిక మొదటి ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు సమాచారం.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ కూడా నటిస్తుండటంతో మరో హీరోయిన్ కోసం మేకర్స్ చూస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కేతిక శర్మ అయితే ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ నెలాఖరు నుంచి ఆమె సెట్స్‌లో అడుగుపెట్టనుందట. దీంతో కేతిక శర్మకు ఇది పెద్ద అవకాశమని సినీ విశ్లేషకులు అంటున్నారు. మాతృకను తెరకెక్కించిన సముద్రఖనీనే ఈ రీమేక్‌ను రూపొందిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం