తెలుగు న్యూస్  /  Entertainment  /  Rishab Shetty Charged 4 Crores For Kantara Rishab Shetty Remuneration

Rishab Shetty Remuneration for Kantara: కాంతార సినిమాకు రిష‌బ్‌శెట్టి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా

15 December 2022, 6:52 IST

  • Rishab Shetty Remuneration for Kantara: కాంతార సినిమాతో పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు రిష‌బ్‌శెట్టి. హీరోగా, ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఈ సినిమా ఎన‌లేని పేరును తీసుకొచ్చింది. కాంతార సినిమాకు రిష‌బ్‌శెట్టి అందుకున్న రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలుసా...

రిష‌బ్‌శెట్టి.
రిష‌బ్‌శెట్టి.

రిష‌బ్‌శెట్టి.

Rishab Shetty Remuneration for Kantara: రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ క‌న్న‌డ చిత్రం కాంతార (Kantara) ఈ ఏడాది నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. దాదాపు ప‌ద‌హారు కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ సినిమా 450 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌న్న‌డంతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. భూత‌కోళ అనే క‌ళ నేప‌థ్యంలో విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రిష‌బ్ శెట్టి ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు

HHVM Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌

Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాతో రిష‌బ్‌శెట్టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాడు. రాజ‌మౌళితో (SS Rajamouli) పాటు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోని టాప్ డైరెక్ట‌ర్స్ కాంతార సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు.

త‌మ‌కు దానంగా వ‌చ్చిన భూమిని అక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన రాజ‌వంశీయుల‌పై శివ అనే యువ‌కుడు సాగించిన పోరాటంతో ఈ సినిమా తెర‌కెక్కింది. కాగా ఈ సినిమాకు హీరో క‌మ్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించినందుకు రిష‌బ్‌శెట్టి కేవ‌లం నాలుగు కోట్ల రెమ్యున‌రేష‌న్‌ మాత్ర‌మే అందుకున్న‌ట్లు స‌మాచారం.

రిష‌బ్ వ‌ల్లే ఈ సినిమా స‌క్సెస్ అయినా అత‌డికి మాత్రం చాలా త‌క్కువ మొత్త‌మే రెమ్యున‌రేష‌న్‌ ద‌క్కిన‌ట్లు చెబుతున్నారు. రిష‌బ్‌శెట్టి త‌ర్వాత కిషోర్‌, స‌ప్త‌మిగౌడ‌ల‌కు త‌లో కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెలుగులో కాంతార సినిమాను అల్లు అర‌వింద్ రిలీజ్ చేశారు.

రెండు కోట్లకు ఈసినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోగా దాదాపు 50 కోట్ల‌ వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. హిందీలో ఈసినిమా 30 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. క‌న్న‌డంలో కేజీఎఫ్‌-2 త‌ర్వాత హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా కాంతార రికార్డ్ క్రియేట్ చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.