Tollywood: వంద కోట్ల బడ్జెట్ - ఐదేళ్లు షూటింగ్ -టాలీవుడ్ మూవీ టైటిలే రికార్డ్ బ్రేక్ - రిలీజ్ ఎప్పుడంటే?
01 February 2024, 14:04 IST
Tollywood: రికార్డ్ బ్రేక్ పేరుతో తెలుగులో దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ మార్చిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరంటే?
ధీర ప్రీ రిలీజ్ ఈవెంట్
Tollywood: బిచ్చగాడు సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కిస్తోన్నాడు. ఈ సినిమాకు రికార్డ్ బ్రేక్ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చదలవాడ శ్రీనివాసరావు తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ ఐదేళ్ల నుంచి జరుగుతోన్నట్లు పేర్కొన్నాడు. మార్చిలో రికార్డ్ బ్రేక్ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు. పాన్ వరల్డ్ మూవీగా రికార్డ్ బ్రేక్ ఉండబోతున్నట్లు వెల్లడించాడు. రికార్డ్ బ్రేక్ మూవీలో హీరోహీరోయిన్లు ఎవరన్నది మాత్రం చదలవాడ శ్రీనివాసరావు రివీల్ చేయలేదు.
పదహారు సినిమాలు...
ధీర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమ బ్యానర్‌లో వస్తోన్న సినిమాలపై చదలవాడ శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమ బ్యానర్‌లో పదహారు సినిమాలు వివిధ దశల్లో షూటింగ్‌ను జరుపుకుంటున్నాయని తెలిపాడు. సునీల్‌కుమార్ రెడ్డితో ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నట్లు చదలవాడ శ్రీనివాసరావు చెప్పాడు. అలాగే కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతోన్న నా కనురెప్పవు నువ్వేరా అనే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. చదలవాడ శ్రీనివాసరావు ప్రొడ్యూస్ చేసిన ధీర మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అతడి తనయుడు లక్ష్ హీరోగా నటిస్తోన్నాడు.
దిల్‌రాజు రిలీజ్...
ధీర సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేస్తున్నారు. బుధవారం జరిగిన ధీర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దిల్‌రాజు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ తాను అధ్యక్షుడిగా గెలవడానికి చదలవాడ శ్రీనివాసరావు ఎంతో సాయం చేశారని ఈ వేడుకలో దిల్‌రాజు అన్నాడు. ఈ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తానని అన్నాడు.
ఆఫీస్‌లా చుట్టూ తిరిగా...
బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కడం చాలా కష్టమని ధీర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో లక్ష్ చదలవాడ అన్నాడు. సినిమా ఆఫర్స్ కోసం తాను చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశం ఇవ్వలేదని, మీ నాన్నగారితోనే సినిమాలు చేయమని సలహాలు ఇచ్చేవారని లక్ష్ చెప్పాడు. ఫిబ్రవరి 2న ధీరతో పాటు రిలీజ్ అవుతోన్న అన్ని సినిమాలు ఆడాలని చెప్పాడు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేసే ఓ యువకుడి కథతో ధీర మూవీ తెరకెక్కుతోందని లక్ష్ చదలవాడ తెలిపాడు. అలాంటి వాడు ఓ పెద్ద బాధ్యతను చేపడితే ఏం జరిగింది అన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని తెలిపాడు.
అసిస్టెంట్ డైరెక్టర్...
చదలవాడ శ్రీనివసరావు బ్యానర్‌లో వచ్చిన పోలీస్ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు టాలీవుడ్ అగ్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపాడు. ధీర సినిమాకు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా 80 శాతం వరకు నైట్ ఎఫెక్ట్స్‌తోనే సాగుతుందని దర్శకుడు అన్నాడు. తెలుగులో వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజుతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు లక్ష్.
టాపిక్